Sonu Sood – Krish: సోషల్ మీడియాలో సెలబ్రిటీలు షేర్ చేసే Throwback పిక్స్ ఏ స్థాయిలో వైరల్ అవుతాయో తెలిసిందే… తాజాగా రియల్ హీరో సోనూ సూద్ పోస్ట్ చేసిన Throwback ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఏంటా పిక్చర్, వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మణికర్ణిక’ చిత్రం అప్పట్లో పలు వివాదాలకు కారణమైంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి సినిమా మధ్యలోనే తప్పుకోవడం, ఆ వెంటనే ప్రముఖ నటుడు సోనూ సూద్ కూడా చిత్రం నుంచి బయటకు రావడం అప్పట్లో సంచలనంగా మారింది.
ఆ సినిమా సెట్‌లో దర్శకుడు క్రిష్‌తో తీసుకున్న ఫొటోను తాజాగా సోనూ సూద్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ‘జీవితంలో మంచి కోసం నడవండి.. ఏదో ఒక రోజు మీరు చేరుకుంటారు’ అని సోనూ కామెంట్ చేశారు.
‘మణికర్ణిక’ సినిమాలో సోనూ సూద్ పాత్ర ప్రాధాన్యం తగ్గించాలని, స్క్రిప్టులో పలు మార్పుల చేయాలని కంగన పట్టుబట్టడంతోనే దర్శకుడు క్రిష్ తప్పుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఆమె డామినేషన్ తట్టుకోలేక ఆ తర్వాత సోనూ సూద్ కూడా బయటకు వచ్చేశారని బాలీవుడ్ లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.