South Heroine Amy Jackson recent photos gone viral in social media
South Heroine : సౌత్ లో స్టార్ హీరోలు, దర్శకుల సినిమాల్లో నటించి తన అందంతో అందర్నీ ఆకట్టుకున్న ఒక హీరోయిన్.. తాజాగా షాకింగ్ లుక్స్ లో కనిపించి అందర్నీ షాక్ కి గురి చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సడన్ గా చూసిన ఆడియన్స్.. ఆమె ఎవరో అని తికమక పడుతున్నారు. అయితే ఆ పిక్స్ షేర్ చేసిన అకౌంట్ చూసి, ఆ తరువాత ఫొటోల్లో ఉన్న హీరోయిన్ గమనిస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఒకసారి మీరు కూడా చూసి గమనించండి.
Dhanush51 : ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.. ఏ ఆర్ రెహమాన్‌కి బయపడి..
తమిళంలో ఆర్య హీరోగా తెరకెక్కిన ‘1947 ఏ లవ్ స్టోరీ’ సినిమాతో పరిచమైన బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్. తాజాగా ఈ భామ ఒక మ్యాగజైన్ కోసం ఓ ఫోటోషూట్ చేసింది. ఆ ఫోటోషూట్ లో డిఫరెంట్ హెయిర్ కట్ తో అసలు గుర్తు పట్టలేని విధంగా ఉంది. ఇక ఆ ఫోటోలను అమీ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి చూసిన నెటిజెన్స్ ఈమె ఏంటి ఇలా అయ్యిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Leo Movie : క్యాప్షన్స్‌తో సినిమా కథని చెప్పేస్తున్న ‘లియో’..
కాగా అమీ జాక్సన్.. రామ్ చరణ్, విక్రమ్, రజినీకాంత్ వంటి స్టార్ హీరోల సరసన కలిసి నటించింది. తెలుగులో ఎవడు సినిమాలో మాత్రమే నటించిన ఈ భామ.. తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ మాత్రమే వస్తుంది. ప్రస్తుతం తమిళ్ హీరో అరుణ్ విజయ్ నటిస్తున్న ‘మిషన్’ సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఆల్రెడీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది.