Dhanush51 : ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.. ఏ ఆర్ రెహమాన్‌కి భయపడి..

ఏ ఆర్ రెహమాన్‌కి భయపడి ధనుష్ 51వ మూవీకి శేఖర్ కమ్ముల, దేవిశ్రీప్రసాద్ ని తీసుకున్నాడట.

Dhanush51 : ధనుష్, శేఖర్ కమ్ముల సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్.. ఏ ఆర్ రెహమాన్‌కి భయపడి..

Devi sri prasad replace a r rahman in Dhanush 51 movie

Updated On : September 22, 2023 / 12:25 PM IST

Dhanush51 : టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల, తమిళ హీరో ధనుష్ కలయికలో ఇటీవల ఒక ప్రాజెక్ట్ లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ధనుష్ 51వ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే, ఈ మూవీకి సంబంధించిన ఒక న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. శేఖర్ కమ్ముల ఏ ఆర్ రెహమాన్ పనికి భయపడడని ఒక న్యూస్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

Leo Movie : క్యాప్షన్స్‌తో సినిమా కథని చెప్పేస్తున్న ‘లియో’..

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా రెహమాన్ ని తీసుకోవాలని శేఖర్ కమ్ముల భావించాడట. అయితే రెహమాన్ తో వర్క్ అంతా ఈజీగా ఉండదట. తనకి నచ్చినప్పుడే పాటలు ఇస్తాడని, ఇచ్చిన పాటలే తీసుకోవాలి తప్ప మరో సాంగ్ చేయడం ఉండదని టాక్ ఉంది. ఈ కారణం వలనే తెలుగు మేకర్స్ రెహమాన్ తో వర్క్ చేయడానికి ఇష్టపడరని చెబుతుంటారు. ఇక ఈ విషయంలోనే శేఖర్ కమ్ముల కూడా భయపడ్డట. అసలు ఈ దర్శకుడు తన సినిమాలను సంగీతంతోనే ఎక్కువ నడిపిస్తుంటాడు.

Bigg Boss 7 : మూడో వారం నామినేషన్స్‌లో ఉన్నది ఎవరు.. ఈసారి పవర్‌ అస్త్ర..!

అలాంటప్పుడు అనేక ట్యూన్స్ చేయాల్సి ఉంటుంది. దీంతో రెహమాన్ తో కష్టమని భావించిన శేఖర్ కమ్ముల.. దేవిశ్రీప్రసాద్ ని తీసుకోవాలని భావిస్తున్నాడట. దేవి ఇటీవల పుష్ప సినిమా పాటలతో నేషనల్ వైడ్ గుర్తింపుని సంపాదించుకున్నాడు. మరి దేవిశ్రీ నిజంగానే ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ ఇచ్చాడా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా రష్మిక మందన్న సెలెక్ట్ అయ్యింది.

ధనుష్ ప్రస్తుతం ‘కెప్టెన్ మిల్లర్’ సినిమాలో నటిస్తున్నాడు. దీని తరువాత తానే డైరెక్టర్ గా తన 50వ సినిమాని తెరకెక్కించనున్నాడు. మరి శేఖర్ కమ్ముల చిత్రాన్ని ఈ మూవీ పూర్తి అయిన తరువాత పట్టాలు ఎక్కిస్తాడా..? లేదా ఈ చిత్రంతో పాటే ఏకకాలంలో షూటింగ్ చేస్తాడా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.