Nilave
Nilave : సౌమిత్ పోలాడి, శ్రేయాసి సేన్ జంటగా ఆతెరకెక్కుతున్న సినిమా ‘నిలవే’. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మాతలుగా సౌమిత్ పోలాడి, సాయి కే వెన్నం దర్శకత్వంలో ఈ నిలవే సినిమా తెరకెక్కుతుంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి టీజర్, ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసారు. తాజాగా నిలవే సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న నిలవే సినిమా రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.
Also Read : Balakrishna : నా పరువు నిలబెట్టావు.. శర్వానంద్ ని అభినందించిన బాలయ్య.. ఎందుకో తెలుసా?
మ్యూజికల్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్, గురురాజ్, సిద్ధార్థ్ గొల్లపూడి, అనాల సుశ్మిత.. పలువురు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా వాలెంటైన్స్ డేకి పర్ఫెక్ట్ టైం లో రిలీజ్ కాబోతుంది.