ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు.. గ్యారంటీగా రికవరీ అవుతారు..

  • Publish Date - August 20, 2020 / 06:43 PM IST

SP Balasubrahmanyam Health Update: గాన గంధ‌ర్వుడు ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇటీవ‌ల‌కరోనా వైర‌స్ సోక‌డంతో చెన్నైలో ఎంజీఎం హాస్పిట‌ల్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. బాలు త్వరగా కోలుకోవాలని సంగీత సంగీత కళాకారులు, బాలు అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు. బాలు తనయుడు ఎస్.పి.చరణ్ తండ్రి ఆరోగ్య పరిస్థితిని గురించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియచేస్తున్నారు. గురువారం సాయంత్రం బాలు హెల్త్ అప్‌డేట్ వీడియో ద్వారా షేర్ చేశారు చరణ్..

‘‘నాన్నగారు రెండు మూడు రోజులనుంచి ఎలాంటి పరిస్థితుల్లో వున్నారో  ఇప్పుడూ అలాగే వున్నారు. ఆయన ఆరోగ్యంలో ఎలాంటి మార్పు లేదు. వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతుంది. నిపుణులైన డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా వున్న అభిమానుల ప్రార్థనలతో గ్యారంటీగా రికవరీ అవుతారు’’.. అని చెప్పారు చరణ్.

ట్రెండింగ్ వార్తలు