అభిమానుల సందర్శనార్థం సత్యం థియేటర్ వద్ద బాలు పార్థివదేహం..

  • Publish Date - September 25, 2020 / 02:17 PM IST

SPB Passes away: ఐదు దశాబ్దాలుగా తన గానామృతంతో సంగీత ప్రియులను, ప్రేక్షకులను అలరించిన ఆ గానగంధర్వుని స్వరం మూగబోయింది. కరోనా బారినపడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ప్రముఖ గాయకులు ఎస్పీ బాల సుబ్రమణ్యం శుక్రవారం (సెప్టెంబర్ 25) మధ్యాహ్నం 01:4 నిమిషాలకు కన్నుమూసినట్లుగా బాలు తనయుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు.




కరోనా నుంచి కొలుకున్నాక మళ్లీ అనారోగ్యం తిరగబెట్టడంతో బాలు పరిస్థితి విషమంగా మారింది. దీంతో చికిత్స పొందుతూ బాలు మృతి చెందారు.
అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థవదేహాన్ని చెన్నైలోని సత్యం థియేటర్ వద్ద ఉంచనున్నారు. ఇప్పటికే అధికారులు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు.




తమిళనాడు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో బాలు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమైయ్యారు. బాలు ఫాం‌హౌస్‌లో అంత్యక్రియలు నిర్వహించే అవకాశముందని సమాచారం. బాలు మరణవార్త వినగానే తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ సినీ పరిశ్రమ వర్గాలు షాక్ అయ్యాయి. సంగీత ప్రియులు, బాలు అభిమానులు ఆయన మరణ వార్తతో శోక సంద్రంలో మునిగిపోయారు.


ట్రెండింగ్ వార్తలు