బాలు అంత్యక్రియల్లో బంధువులకు మాత్రమే అనుమతి?..

  • Publish Date - September 25, 2020 / 08:32 PM IST

#SPBalasubrahmanyamLivesOnForever: ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గాయకుడిగా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసిన బాలు మరణంతో సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.

ఈరోజు సాయంత్రం ఎంజీఎం హాస్పిటల్ నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్ఇంటికి అభిమానుల సందర్శనార్థం బాలు పార్థీవదేహాన్ని తరలించారు. బాలును కడసారి చూసేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకున్నారు.


అక్కడి జనసందోహాన్ని కంట్రోల్ చేయడం కష్టతరంగా మారింది. తర్వాత రెడ్‌హిల్స్‌లోని ఫా‌మ్‌హౌస్‌కు బాలు పార్థివదేహాన్ని తరలించారు. ఇదిలా ఉంటే ఎస్పీ బాలు అంత్యక్రియలు రేపు ఉదయం (సెప్టెంబర్ 26) 10:30 తర్వాత తమిళనాడు తిరువళ్లూరు జిల్లా రెడ్ హిల్స్ ఫా‌మ్‌హౌస్‌ లో ప్రభుత్వ లాంఛనాలతో జరుగనున్నాయి. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యే అవకాశముండడంతో అంత్యక్రియలకు కేవలం బంధువులను మాత్రమే అనుమతివ్వాలనే యోచనలో ఉన్నారు.