Radhe Shyam (1)
Radhe Shyam: రిలీజ్ డేట్ దగ్గరపడుతుంది.. ఇక ఏమాత్రం సైలెన్స్ గా ఉన్నా ఫాన్స్ నుంచి వచ్చే కామెంట్స్ తట్టుకోలేం అనుకున్నారు రాధేశ్యామ్ టీమ్. వరసగా అప్ డేట్స్ ఇస్తూ, ప్రమోషన్ స్పీడ్ పెంచేశారు. లేటెస్ట్ గా సూపర్ అప్ డేట్ తీసుకొచ్చారు రాధేశ్యామ్ మేకర్స్. సినిమాలో విక్రమాదిత్య కథను న్యారెట్ చేసేది స్టార్ డైరెక్టర్ రాజమౌళి అని రివీల్ చేసిన మేకర్స్ వరసగా ఆ వెంటనే మరో ట్రైలర్ కూడా తీసుకొచ్చారు. అదే పనిగా ప్రమోషన్ కార్యక్రమాలు ఎలా చేస్తారో కూడా రిలీవ్ చేశారు.
Radhe Shyam: ట్రైలర్‌తో కౌంట్‌డౌన్ స్టార్.. వారం రోజుల పాటు ప్రమోషన్ ఈవెంట్స్!
వరసగా ఇచ్చే అప్ డేట్స్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. రాధేశ్యామ్ సినిమా హిందీ వెర్షన్ కు బిగ్ బి వాయిస్ ఓవర్ అందించారన్న విషయాన్ని రివీల్ చేయడంతో సర్ ప్రైజ్ ఫీలయ్యారు. బాలీవుడ్లో సూపర్ హిట్ సినిమాలకు వాయి ఓవర్ ఇచ్చిన అమితాబ్.. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాను న్యారేట్ చేయబోతున్నారంటే. బిగ్ బి న్యారేషన్ తో 1970స్ బ్యాక్ డ్రాప్ లోని విక్రమాదిత్య స్టోరీ హైలైట్ అవుతుందని సంబరపడుతున్నారు ప్రభాస్ ఫాన్స్.
Radhe Shyam Release Trailer: ప్రేమకి విధికి మధ్య జరిగిన యుద్ధమే రాధేశ్యామ్!
తెలుగు వెర్షన్ కు ఎవరు వాయిస్ ఇస్తారా అని ఆసక్తిగా చూశారు ఫాన్స్. ఆ మధ్య సూపర్ స్టార్ మహేశ్ బాబు వాయిస్ ఇచ్చాడని టాక్ క్రియేట్ చేశారు. కాని, ఎవరి ఎక్స్ పెక్టేషన్స్ కూ అందకుండా స్టార్ డైరెక్టర్ రాజమౌళితో వాయిస్ ఓవరిప్పించి మరోసారి ఫాన్స్ ను సర్ ప్రైజ్ చేశాడు ప్రభాస్. అంతే కాదు, కన్నడ వెర్షన్ కు శివ రాజ్ కుమార్, మలయాళం కు పృథ్విరాజ్ సుకుమారన్, తమిళంలో సత్యరాజ్ తో వాయిస్ ఇప్పించి పాన్ ఇండియా లెవెల్ లో సినిమా పై స్పెషల్ అటెన్షన్ క్రియేట్ చేశారు రాధేశ్యామ్ ప్రొడ్యూసర్స్.
Radhe Shyam: థియేటర్స్‌లో ఆస్ట్రాలజీ కౌంటర్.. వాట్ యాన్ ఐడియా!
వరల్డ్ వైడ్ దాదాపు 10 వేల థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది రాధేశ్యామ్. హిందీతో పాటూ సౌత్ లాంగ్వెజెస్ అన్నింటిలో రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. ఫాన్స్ పండగ చేసుకునేలా మార్చి 4 నుండి మార్చి 10 వరకు చెన్నై, ముంబైతో పాటు తెలుగులో కూడా ఈవెంట్స్ ఉండబోతున్నాయని, ఆడియన్స్ ఎగ్జైట్ అయ్యేలా ఎనౌన్స్ చేసి, ప్రభాస్ అభిమానులకు మరింత కిక్ ఇచ్చారు డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్.