Special Poster from Prabhas Raja saab movie
Raja saab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పుల్ ఫామ్‌లో ఉన్నాడు. వరుస విజయాలతో మంచి జోష్‌లో ఉన్న ప్రభాస్ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. అందులో మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ మూవీ ఒకటి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధిలు కథానాయికలు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Ajay : మహేష్, తారక్ అజయ్ కి అంత క్లోజా.. పిలిచి మరీ ఛాన్స్ లు ఇచ్చిన మహేష్.. కానీ..
ఇదిలా ఉంటే.. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ క్రమంలో చిత్ర బృందం ఆయన పుట్టిన రోజుకు రెండు రోజుల ముందు నుంచే అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అయింది. అందులో భాగంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. గళ్ళ చొక్కా, నల్ల ఫ్యాంటు, టీ షర్ట్ ధరించిన ప్రభాస్ లుక్ అదిరిపోయింది. ఈ పోస్టర్ అభిమానులను అలరిస్తోంది. ఇక ప్రభాస్ బర్త్ డే రోజున టీజర్‌ను విడుదల చేయనున్నారు.
Swag turned up to the MAX 😎
&
Now….your Celebrations will go off in STYLE 😉A ROYAL TREAT AWAITS on 23rd Oct 💥💥#Prabhas #TheRajaSaab pic.twitter.com/wEu31XSGFW
— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024