Ajay : మహేష్, తారక్ అజయ్ కి అంత క్లోజా.. పిలిచి మరీ ఛాన్స్ లు ఇచ్చిన మహేష్.. కానీ..
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అజయ్ మాట్లాడుతూ..

Artist Ajay Interesting Comments on Mahesh and Tarak
Ajay : సీనియర్ నటుడు అజయ్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే 25 సంవత్సరాలు దాటిపోయింది. ఎన్నో సినిమాల్లో నటించిన అజయ్ త్వరలోనే పొట్టేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఆ మధ్య కాలంలో సినిమాలకి కాస్త దూరమైన అజయ్ మళ్ళీ ఫామ్ లోకి వస్తున్నాడు. అనన్య నాగళ్ళ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ కీలక పాత్ర పోషించాడు.
ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ విడుదల చేసారు. ట్రైలర్ లో ఆడ వేషంలో కనిపించి అదరగొట్టేశాడు అజయ్.. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో ప్రస్తుతం ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మూవీ టీమ్.
Also Read : Jithender Reddy : మొత్తానికి రిలీజ్ అవుతున్న ‘జితేందర్ రెడ్డి’.. ఎప్పుడంటే..
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ లో పాల్గొన్న అజయ్ మాట్లాడుతూ.. తారక్, మహేష్ బాబు నాకు మంచి స్నేహితులు.. మహేష్ స్వయంగా త్రివిక్రమ్, పూరీ జగన్నాథ్ లతో మాట్లాడి నాకు అతడు, పోకిరి సినిమాల్లో ఛాన్స్ ఇప్పించాడు. డార్లింగ్ ప్రభాస్ కూడా చాలా విషయాల్లో హెల్ప్ చేసాడు. కానీ ఇవన్నీ నేను బయటికి చెప్పలేదు. ఇప్పుడున్న చాలా మంది స్టార్ హీరోస్ కి ఒకప్పుడు నేను ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. అలా నాకు వాళ్లు బాగా క్లోజ్ అని అన్నాడు.