Sarkaru Vaari Paata: సర్కారు వారి పాటకు టీ-సర్కార్ ‘స్పెషల్’ ఆఫర్!

మరికొద్ది గంటల్లో సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న...

Special Show Permission Granted For Sarkaru Vaari Paata In Hyderabad

Sarkaru Vaari Paata: మరికొద్ది గంటల్లో సర్కారు వారి పాట చిత్రంతో మహేష్ బాబు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాడు. దర్శకుడు పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీపై మొదట్నుండీ భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసేందుకు మహేష్ సిద్ధమయ్యాడు. అయితే ఇప్పటికే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సర్కారు వారి పాట చిత్రానికి తెలంగాణ సర్కార్ మరో స్పెషల్ ఆఫర్ ఇచ్చింది.

Sarkaru Vaari Paata: ఆ ఒక్కదాని కోసం పది రోజులు కష్టపడ్డ మహేష్!

హైదరాబాద్‌లో ఈ సినిమా స్పెషల్ బెనిఫిట్ షోను ప్రదర్శించేందుకు టీ-సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూకట్‌పల్లిలోని బ్రమరాంబ, మల్లిఖార్జున, విశ్వనాథ్ థియేటర్లతో పాటు మూసాపేట్‌లోని శ్రీరాములు థియేటర్లలో ఏప్రిల్ 12న సర్కారు వారి పాట చిత్ర బెనిఫిట్ షోలను తెల్లవారుజామున 4 గంటలకు ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. దీంతో చిత్ర యూనిట్ తెలంగాణ సర్కార్‌కు తమ కృతజ్ఞతలు తెలిపింది. ఈ విషయం తెలుసుకున్న మహేష్ అభిమానులు ఆయా థియేటర్లలో బెనిఫిట్ షోను వీక్షించేందుకు రెడీ అవుతున్నారు.

Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మాస్ ట్రీట్.. మరికొన్ని గంటలే టైమ్!

ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో సర్కారు వారి పాట రచ్చ చేస్తుండగా, ఈ బెనిఫిట్ షోలు మహేష్ అభిమానుల్లో పండగ వాతావరణాన్ని తీసుకురావడం ఖాయం. మరి ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్‌ను ఇస్తారనేది రేపు ఉదయం తేలిపోనుంది. మహేష్ చాలా రోజుల తరువాత మాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో సముధ్రఖని, నదియా, వెన్నెల కిషోర్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.