Gummadi Narsaiah : ‘గుమ్మడి నర్సయ్య’ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పాట విడుదల

బయోపిక్ సినిమాలు అనేవి ఆడియెన్స్‌లో ఎప్పుడూ ఆసక్తిని రేపుతుంటాయి. అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిది అయిన గుమ్మడి నర్సయ్య పై ఇప్పుడు ఒక బయోపిక్ రాబోతుంది.

special song released from Gummadi Narsaiah on occasion of Narsaiah birthday

Gummadi Narsaiah : బయోపిక్ సినిమాలు అనేవి ఆడియెన్స్‌లో ఎప్పుడూ ఆసక్తిని రేపుతుంటాయి. ఉన్నది ఉన్నట్టుగా తీశారా? ఏమైనా అదనంగా చూపిస్తున్నారా? అసలు వాస్తవాలు బయటకు చూపిస్తారా? అనే ఆలోచనలతో జనాలు ఆ బయోపిక్ సినిమాలను చూస్తుంటారు. అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిది అయిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

Shiva Karthikeyan : సింహాన్ని పెంచుకోబోతున్న తమిళ్ హీరో శివ కార్తికేయన్.. లిస్ట్‌లో ఇది రెండో సింహం!

ప్రజల కోసం ప్రజల కొరకే నా జీవితం అంటూ ముందుకు సాగిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలిచేలా తెరకెక్కిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. గుమ్మడి నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు.

ఈ మేరకు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలె మాట్లాడుతూ.. ‘ఈరోజు శ్రీ గుమ్మడి నర్సయ్య గారి పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశాం. ప్రేక్షక మహాశయులు అందరూ చూసి మా చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. బయోపిక్ కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చాలా శ్రద్దగా, నిదానంగా సినిమాను తీస్తున్నాం. ఇకపై సినిమాకు సంబంధించిన అప్డేట్లను రెగ్యులర్‌గా ఇస్తామ’ని తెలిపారు.

Balakrishna : మా జీవనం కోసం కాదు.. ఇండస్ట్రీ బ్రతకడం కోసం నటిస్తున్నాము.. సీనియర్ హీరోల గురించి బాలయ్య కామెంట్స్!

చరణ్ అర్జున్ అందించిన బాణీ, పాడిన తీరు పాటను వినసొంపుగా మార్చింది. గుమ్మడి నర్సయ్య వ్యక్తిత్వం, మంచితనం, గొప్పదనం తెలిసేలా రాసిన పాట శ్రోతలను కదిలించేలా ఉంది. ఈ పాటతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా ఉంది. ఈ పాట త్వరలోనే అందరి నోట వినిపించేలా కనిపిస్తోంది.