Special update may come from og movie on Pawan Kalyan Birthday
Pawan Kalyan Birthday : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ (OG) మూవీపై ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన హరిహర వీరమల్లు కంటే ఓజీ కోసమే ఫ్యాన్స్ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25న మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అంతకంటే ముందే సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే (Pawan Kalyan Birthday) ఉంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతోందట మూవీ యూనిట్.
సుజీత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఓజీ సినిమా నుంచి ఒక స్పెషల్ వీడియో సాంగ్ రిలీజ్‌కు ప్లాన్ జరుగుతోందట. గతేడాది పవన్ బర్త్‌డే సందర్భంగా హంగ్రీ చీతా గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్‌లో జోష్ నింపగా, ఈసారి మరో హైఎనర్జీ వీడియోతో అభిమానులకు కన్నుల పండగ చేయాలని భావిస్తోందట మూవీ యూనిట్. ఈ వీడియోలో పవన్ కల్యాణ్ స్టైలిష్ లుక్, యాక్షన్ సీక్వెన్స్‌లతో పాటు తమన్ సంగీతం మరోసారి దుమ్ము రేపనుందని టాక్.
Kishkindhapuri : ‘కిష్కింధపురి’ టీజర్ వచ్చేసింది.. బెల్లంకొండ, అనుపమ మామూలుగా భయపెట్టలేదుగా..
ఓజీ నుంచి ఇప్పటికే విడుదలైన ఓ ఆడియో లిరికల్ సాంగ్ ఫ్యాన్స్‌ను బాగా ఆకట్టుకుంటుంది. ఈ పాటనే ఇప్పుడు పవన్ బర్త్‌డే స్పెషల్‌గా వీడియో సాంగ్ రూపంలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ వీడియో సాంగ్‌లో పవన్ కల్యాణ్ డైనమిక్ యాక్షన్, స్టైలిష్ అవతార్‌తో పాటు సినిమాకు సంబంధించిన కొత్త గ్లింప్స్‌లు కూడా ఉంటాయని అంటున్నారు. ఈ వీడియో సాంగ్‌ను బర్త్‌డే రోజున రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ ఇవ్వాలని డైరెక్టర్ సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య ప్లాన్ చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
పవన్ కల్యాణ్ బర్త్‌డే సందర్భంగా ఓజీ టీమ్ నుంచి వచ్చే ఈ వీడియో సాంగ్‌పై ఫ్యాన్స్‌లో ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ఆల్‌మోస్ట్ కంప్లీట్ అయిందని.. ఇంకో రెండుమూడ్రోజులు షూట్ చేస్తే సరిపోతుందని అంటున్నారు. ఈ వీడియో సాంగ్ రిలీజ్‌తో పాటు ఓ కీలక అప్‌డేట్‌ను కూడా వెల్లడించే అవకాశం ఉందని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి కూడా స్పెషల్ పోస్టర్స్ లేదా టీజర్‌లు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని టాక్. ఈ బర్త్‌డే సెలబ్రేషన్స్‌తో పవన్ ఫ్యాన్స్‌కు రెండు చిత్రాల నుంచి సర్‌ప్రైజ్‌లు రెడీ అవుతున్నాయని అంటున్నారు.