వీడియో చిక్కులు : జైలులో నిద్ర పట్టలేదు – పాయల్ రోహత్గి

  • Publish Date - December 19, 2019 / 03:31 AM IST

రాత్రి భయంతో జైలులో నిద్ర కూడా పట్టలేదు..జైల్లో చాలా భయపడ్డాను..జైలు నుంచి బయటకు రావడంతో చాలా హ్యాపీగా ఉందంటోంది నటి పాయల్ రోహత్గి. గాంధీ – నెహ్రూ కుటుంబాలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే కారణంతో రాజస్థాన్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2019, డిసెంబర్ 17వ తేదీ మంగళవారం బుండి సెంట్రల్ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ…

జనరల్ వార్డులో ఉంచారని, చలి ఎక్కువగా ఉండడంతో రాత్రి నిద్ర లేకుండా గడిపానని తెలిపారు. తాను ఎప్పుడూ దేశం గురించి ఆలోచిస్తానని, అయితే..అకారణంగా జైలుకు వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. నెహ్రూ కుటుంబంపై అప్‌లోడ్ చేసిన వీడియో..ఇంత పెద్ద చిక్కులు తీసుకొస్తుందని ఊహించలేదని తెలిపారు. మరోసారి తప్పు జరగకుండా చూసుకుంటానని, చట్టాలపై తనకు అవగాహన లేదన్నారు. జైలుకెళ్లడం మొదటిసారి, చివరిసారి అనుకుంటానన్నారు. మొత్తం మీద జైలులో నరకం అనుభవించానని పాయల్ రోహత్గి వెల్లడించారు. 

Read More : రూలర్ లో తన గెటప్ వెనుక కథ చెప్పిన బాలయ్య

* నెహ్రూ, మోతీలాల్ నెహ్రూ, ఇందిరా గాంధీలపై సెప్టెంబర్ 01వ తేదీన ఫేస్ బుక్‌లో అభ్యంతకర వీడియోను రోహత్గి పోస్టు చేశారని బుంది పీఎస్‌లో రాజస్థాన్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అక్టోబర్‌లో కంప్లయింట్ చేశారు. 
* ఇన్ఫరేషన్ టెక్నాలజీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేశారు. 
* 2019, డిసెంబర్ 15వ తేదీ ఆదివారం ఉదయం రాజస్థాన్‌కు చెందిన దర్యాప్తు బృందం సభ్యులు ముంబై వెళ్లి..పాయల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
* పాయల్ పలు హిందీ టీవీ, రియాల్టీ షోలో పాల్గొని ప్రేక్షకుల మన్ననలు పొందింది. అంతేగాకుండా కొన్ని బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది.