Iswarya Menon : పవన్ OGలో ఛాన్స్ కొట్టేసిన స్పై భామ ఐశ్వర్య.. నిజమేనా?

పవన్ కళ్యాణ్ OG సినిమాలో స్పై భామ ఐశ్వర్య మీనన్ ఛాన్స్ కొట్టేసిందట. నెట్టింట వైరల్ అవుతున్న వార్త నిజమేనా?

Spy Iswarya Menon Pawan Kalyan OG

Iswarya Menon : తమిళ పొన్ను ఐశ్వర్య మీనన్ లక్కీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుసుంది. టాలీవుడ్ ఎంట్రీతోనే పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్న ఈ భామ.. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలోనే ఛాన్స్ అందుకుందట. ఇటీవల యంగ్ హీరో నిఖిల్ నడిచిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్పై (Spy) ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఫ్రీడమ్ ఫైటర్ సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ అంటూ క్యూరియాసిటీని కలుగజేసిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించుకుంది.

Yatra 2 : యాత్ర 2 అనౌన్స్ టీజర్ లీక్.. నెట్టింట వీడియో వైరల్..

అయితే ఈ సినిమాలో నిఖిల్ తో పాటు ఐశ్వర్య కూడా యాక్షన్ స్టంట్స్ చేసి అందరగొట్టేసింది. ఇక అవి చూసిన OG మేకర్స్ కి ఒక ముఖ్య పాత్రలో ఐశ్వర్యని ఎంపిక చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ క్రమంలోనే ఆమెను కలిసి కథ వినిపించగా ఐశ్వర్య కూడా వెంటనే ఒకే చెప్పేసిందని ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. చిత్ర యూనిట్ నుంచి అయితే ఎటువంటి అధికారిక ప్రకటన బయటకి రాలేదు.

Animal : యానిమల్ రిలీజ్ వాయిదా.. ఇక పోటీ చిరు, రజిని మధ్యనే..

కాగా ఈ సినిమాలో ప్రియాంక మోహన్ (Priyanka Mohan) హీరోయిన్ గా నటిస్తుంది. ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, శ్రియారెడ్డి.. పలువురు స్టార్ ఆర్టిస్టులు నటిస్తున్నారని ప్రకటించి ఇప్పటికే సినిమాపై అంచనాలను పెంచారు. ఇప్పుడు ఐశ్వర్య కూడా ఈ సినిమాలో భాగం కాబోతుందని తెలియడంతో మరింత గ్లామర్ యాడ్ అవబోతుందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా మూడో షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో మొత్తం 50 శాతం షూటింగ్ పూర్తయిందని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. పవన్ మరో 20 రోజులు పాటు ఈ మూవీ షూటింగ్ లో పాల్గొంటే సినిమాలోని తన పాత్ర చిత్రీకరణ మొత్తం కంప్లీట్ అయ్యిపోతుందట.

ట్రెండింగ్ వార్తలు