Jithendar Reddy : ‘జితేందర్ రెడ్డి’ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర.. వాజ్ పేయ్ పాత్ర కూడా..

జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కొన్ని చోట్ల వేశారు.

Sr NTR and Vajpayee Characters in Jithendar Reddy Movie

Jithendar Reddy : జగిత్యాల నాయకుడు, నక్సలైట్స్ కు వ్యతిరేకంగా పోరాడిన దివంగత జితేందర్ రెడ్డి బయోపిక్ అయన పేరు మీదే తెరకెక్కించారు. విరించి వర్మ దర్శకత్వంలో జితేందర్ రెడ్డి తమ్ముడు రవీందర్ రెడ్డి నిర్మాణంలో రాకేష్ వర్రే లీడ్ రోల్ లో ఈ సినిమాని నిర్మించారు. జితేందర్ రెడ్డి సినిమా నవంబర్ 8న రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్స్ కొన్ని చోట్ల వేశారు.

జగిత్యాలలో స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగి ప్రజల కోసం పోరాడి, నక్సలైట్స్ కు వ్యతిరేకంగా పోరాడి నక్సలైట్స్ చేతిలోనే చనిపోయాడు జితేందర్ రెడ్డి. అప్పట్లో ఆయన ఓ విషయంలో ఎన్టీఆర్ ని కలిశారు, అలాగే దివంగత ప్రధానమంత్రి వాజ్ పేయి వరంగల్ సభకు వస్తే భారీ జనసమీకరణ చేసి ఆయన్ను కలిశారు. దీంతో ఈ సన్నివేశాలను కూడా సినిమాలో చూపించారట. ఆల్రెడీ ఈ సినిమా ట్రైలర్ లోనే సీనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి చిన్న క్లిప్ కూడా చూపించారు.

Also Read : Pushpa 2 – Thaman : పుష్ప 2 కోసం తమన్ ఎందుకు.. ? సుకుమార్ మళ్ళీ ఏం మార్పులు చేస్తున్నాడు?

అయితే పేర్లు మార్చినా ఎన్టీఆర్, వాజ్ పేయ్ ఆహార్యం అలాగే కనపడేలా వ్యక్తులను తీసుకొచ్చారట. వాళ్ళతో జితేందర్ రెడ్డి ఉండే సీన్స్ కూడా పవర్ ఫుల్ గా ఉంటాయట. దీంతో జితేందర్ రెడ్డి సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ పాత్ర, వాజ్ పేయి పాత్ర చూపించినట్టు తెలుస్తుంది. మరి సినిమా రిలీజయ్యాక ఈ సీన్స్ ఏ రేంజ్ లో వైరల్ అవుతాయో చూడాలి.