Om Bheem Bush Collections : అదరగొట్టిన శ్రీవిష్ణు.. ‘ఓం భీమ్ బుష్’ మూవీ రెండు రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఫుల్ గా నవ్విస్తున్న ఓం భీమ్ బుష్ సినిమాకి కలెక్షన్స్ కూడా ఫుల్ గా వస్తున్నాయి.

Sree Vishnu Om Bheem Bush Two Days Collections Full Details Here

Om Bheem Bush Collections : హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఓం భీమ్ బుష్’. ఈ సినిమాలో ప్రీతి ముకుందన్, అయేషా ఖాన్ ఫిమేల్ లీడ్స్ లో నటించగా ప్రియా వడ్లమాని ఓ స్పెషల్ సాంగ్ లో, కామాక్షి భాస్కర్ గెస్ట్ పాత్రలో మెరిపించింది. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఓం భీమ్ బుష్ సినిమా మార్చ్ 22న గ్రాండ్ గా రిలీజ్ అయింది.

ఓం భీమ్ బుష్ సినిమా రిలీజయిన దగ్గర్నుంచి మంచి టాక్ తెచ్చుకుంది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టి, చివర్లో ఓ ఎమోషనల్ పాయింట్ ని కూడా చూపించి ప్రేక్షకులని మెప్పించారు. సినిమా చూసిన ప్రేక్షకులంతా అదిరిపోయిందని అంటున్నారు. ఫుల్ గా నవ్విస్తున్న ఓం భీమ్ బుష్ సినిమాకి కలెక్షన్స్ కూడా ఫుల్ గా వస్తున్నాయి.

Also Read : Siddhu Jonnalagadda : షూటింగ్‌లో సిద్ధూకి గాయాలు.. అయినా నెక్స్ట్ డే షూటింగ్.. ఫస్ట్ టైం భారీ యాక్షన్ సినిమా..

ఓం భీమ్ బుష్ సినిమా మొదటి రోజు కేవలం 4.6 కోట్ల గ్రాస్ వచ్చింది. హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు పెరిగి రెండు రోజుల్లో ఈ సినిమా ఏకంగా 10.44 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. అమెరికాలో కూడా 250K డాలర్స్ పైగా వసూలు చేసి 1 మిలియన్ డాలర్స్ వైపు దూసుకెళ్తుంది. ఇవాళ ఆదివారం కావడం, దరిదాదాపుల్లో టిల్లు స్క్వేర్ తప్ప ఇంకే పెద్ద, మీడియం సినిమాలు లేకపోవడంతో ఓం భీమ్ బుష్ కి మరింత కలిసొచ్చే అవకాశం ఉంది. శ్రీవిష్ణు గత సినిమా ‘సామజవరగమన’ 50 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అతని కెరీర్ లోనే పెద్ద హిట్ అయింది. మరి ఓం భీమ్ బుష్ సినిమాతో ఆ రికార్డ్ ని శ్రీవిష్ణు బ్రేక్ చేస్తాడేమో చూడాలి.

ఇక ఓం భీమ్ బుష్ కథ విషయానికొస్తే.. క్రిష్(శ్రీవిష్ణు), వినయ్(ప్రియదర్శి), మాధవ్(రాహుల్ రామకృష్ణ) ముగ్గురు కుర్రాళ్ళు కాలేజీలో రచ్చ చేసి PHD తో బయటకి వచ్చి భైరవపురం అనే ఊళ్ళో తమ సైంటిస్ట్ తెలివితేటలతో అక్కడి వాళ్ళ సమస్యలు తీరుస్తుండటంతో అక్కడ అదే పని చేస్తున్న ఉన్న అఘోరాలు తమ పొట్ట కొడుతున్నారని, ఈ ముగ్గురు నిజంగా తోపు అయితే ఆ ఊరి చివర సంపంగి మహల్ లోకి వెళ్లి దయ్యాన్ని పట్టుకొని, అక్కడ నిధి తీసుకురావాలని ఛాలెంజ్ చేయగా దీనికి ఒప్పుకున్న ఈ ముగ్గురు ఆ మహల్ కి వెళ్లి దయ్యాన్ని ఎలా డీల్ చేసారు? ఆ దయ్యం కథేంటి? దయ్యం ఇచ్చిన ట్విస్ట్ ఏంటి? వీళ్లకు నిధి దొరికిందా? అనేది తెరపై చూడాల్సిందే.