Single : శ్రీవిష్ణు అదరగొడుతున్నాడుగా.. సింగల్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతో తెలుసా?

ఇటీవల శ్రీవిష్ణు తన సినిమాలతో మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు.

Sree Vishnu Single Movie First Day Collections

Single : వరుస హిట్స్ తో ఫామ్ లో ఉన్న శ్రీ విష్ణు నిన్న మే 9 న సింగిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా ముఖ్య పాత్రల్లో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాణంలో కార్తీక్ రాజు దర్శకత్వంలో ఈ సింగిల్ సినిమా తెరకెక్కింది.

Also Read : Surekhavani : కూతురితో కలిసి నటి సురేఖవాణి పుట్టిన రోజు వేడుకలు.. ఫోటోలు చూశారా?

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా, ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఫుల్ కామెడీ, కాస్త ఎమోషన్ తో సింగిల్ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇటీవల శ్రీవిష్ణు తన సినిమాలతో మంచి కలెక్షన్స్ సాధిస్తున్నాడు. ఇప్పుడు సింగిల్ సినిమా కూడా ఓపెనింగ్ రోజు 4.15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఈ రెండు రోజులు కూడా వీకెండ్ కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది.