Site icon 10TV Telugu

SWAG Trailer : శ్రీ విష్ణు ‘స్వాగ్’ ట్రైల‌ర్.. అదిరిపోయిందిగా..

SWAG Theatrical Trailer

SWAG Theatrical Trailer

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న చిత్రం ‘స్వాగ్’. హసిత్ గోలి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ మూవీ తెర‌కెక్కుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీతూ వర్మ హీరోయిన్‌. మీరా జాస్మిన్, సునీల్ , దక్ష నాగర్కర్, శరణ్య ప్రదీప్, గెటప్ శ్రీను లు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వివేక్ సాగర్ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 4న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో చిత్ర బృందం ప్ర‌మోష‌ల్ కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచింది.

అందులో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది. మొన్న‌నే ఫ్రెంచ్ యువ‌రాణిని ఏకాంతంగా క‌లిశాం అని శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభమైంది. శ్రీవిష్ణు త‌న‌ కామెడీ టైమింగ్ తో అద‌ర‌గొట్టాడు.

Hemalatha Reddy : గ్లామన్ మిసెస్ ఇండియా 2024 అవార్డు గెలుచుకున్న హీరోయిన్..

ఈ మూవీలో సింగ, భవభూతి, యయాతి, కింగ్ భవభూతి అనే నాలుగు పాత్రల్లో శ్రీ విష్ణు క‌నిపిస్తాడు. 1551లో ఈ క‌థ మొద‌లై నేటి వ‌ర‌కు దాదాపు నాలుగు టైమ్ లైన్స్‌లో న‌డ‌వ‌నున్న‌ట్లుగా ట్రైల‌ర్ ను బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. పురుషాధిక్యం అనే పాయింట్ ఆధారంగా ‘స్వాగ్’ సినిమా తీసినట్లు తెలుస్తోంది. మొత్తంగా ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేసింది.

Exit mobile version