Sree Vishnus next with Sithara Entertainments announced
Sree Vishnu : వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న హీరో శ్రీ విష్ణు. ప్రతి సినిమాలోనూ ప్రేక్షకులను తనదైన శైలిలో నవ్విస్తూ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా మారారు. తాజాగా ఆయన (Sree Vishnu) సన్నీ సంజయ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ విషయాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. తమ బ్యానర్‌లో 39వ సినిమాగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్నట్లు వెల్లడించింది. “ప్రతి యువకుడి కథ”(The Story of Every Youngster) అనే అద్భుతమైన ట్యాగ్‌లైన్‌తో ఉన్న అనౌన్స్‌మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది.
Krishna : శివుడిగా కృష్ణ ను చూపించబోతున్నారా..? కృష్ణ అల్లుడి సినిమాలో..
The story of every YOUNGSTER 🤘
A new-gen entertainer packed with laughs, vibes & emotions that stay with you ❤️🔥#SitharaEntertainments Production No.39 x @SreeVishnuOffl 🔥
Directed by @ASunnySanjay
Produced by @vamsi84 & #SaiSoujanyaShoot begins soon 🎬@SitharaEnts… pic.twitter.com/la5NV2YIK9
— Sithara Entertainments (@SitharaEnts) November 5, 2025
సున్నితమైన భావోద్వేగాలతో నిండిన, రోజువారీ జీవితాన్ని నిర్వచించే నిశ్శబ్ద సంఘర్షణలు, ఆశలు, సంతృప్తిలను అన్వేషించే కథతో మరోసారి ప్రేక్షకుల మనసు దోచుకోబోతున్నామని, అతి త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించింది. మరిన్ని వివరాలను అతి త్వరలోనే తెలియజేస్తామని పేర్కొంది.