Sreeleela : శ్రీలీల ఫస్ట్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది తెలుసా.. ఆహాలో శ్రీలీల ఫస్ట్ తెలుగు మూవీ!

శ్రీలీల (sreeleela) కిస్ (Kiss) అనే రొమాంటిక్ కన్నడ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసింది. విరాట్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి 'ఐ లవ్‌ యు ఇడియట్‌' అనే టైటిల్ తో..

Sreeleela : హీరోయిన్ శ్రీలీల (Sreeleela) టాలీవుడ్ లో నెంబర్ వన్ ప్లేస్ వైపు దూసుకుపోతుంది. ఇటీవల ధమాకా (Dhamaka) సినిమాతో 100 కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో స్టార్ హీరోల పక్కన ఛాన్స్ లు దక్కించుకుంటూ క్రేజీ ఆఫర్స్ ని సొంతం చేస్తుకుంటుంది. ప్రెజెంట్ ఈ అమ్మడి చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. పెళ్లి సందడి సినిమాతో తెలుగులో పరిచమైన శ్రీలీల కన్నడ సినిమాలతో కెరీర్ స్టార్ట్ చేసింది. కిస్ (Kiss) అనే రొమాంటిక్ కామెడీ డ్రామాతో 2019 ఆడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది.

Pushpa 2 : కాళీమాత రూపంలో పుష్ప రాజ్.. వైరల్ అవుతున్న ఫోటో!

విరాట్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగులో డబ్ అయ్యి ‘ఐ లవ్‌ యు ఇడియట్‌’ (I Love You Idiot) అనే టైటిల్ తో గత ఏడాది డిసెంబర్ 17న థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా భవానీ మీడియా సంస్థ ద్వారా తెలుగు ఓటిటి ప్లాట్‌ఫార్మ్ ఆహాలో రిలీజ్ చేశారు. ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలోని హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం ఆహాలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమాకు హరికృష్ణ సంగీతం అందించాడు.

Pushpa 2 : అడవిలో పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చాడని అర్ధం..

ఇక ప్రస్తుతం శ్రీలీల.. మహేష్ బాబుతో (Mahesh Babu) SSMB28, బాలకృష్ణతో NBK108, రామ్ పోతినేని – బోయాపాటి సినిమా, నవీన్ పోలిశెట్టి – అనగనగ ఒక రాజు, నితిన్ 32, పంజా వైష్ణవ తేజ్ సినిమాల్లో నటిస్తుంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీలీల ఎంపిక అయ్యినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దాని పై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

Sreeleela debut movie I Love You Idiot released in Aha

 

ట్రెండింగ్ వార్తలు