×
Ad

Sreeleela: బంపర్ ఆఫర్ దక్కించుకున్న శ్రీలీల.. ఏకంగా ధనుష్ తో.. మరీ ఈసారైనా?

ధనుష్ 55వ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకున్న శ్రీలీల(Sreeleela).

Sreeleela is the heroine in dhanush 55th movie with rajkumar periasamy

  • తమిళంలో మరో సినిమా ఒకే చేసిన శ్రీలీల
  • ధనుష్ పక్క నటించే అవకాశం
  • అమరన్ దర్శకుడితో కొత్త సినిమా

Sreeleela: సినిమా ఇండస్ట్రీలో కెరీర్ అనేది విజయాల మీద నడుస్తుంది. రెండు ప్లాప్స్ పడ్డాయంటే అంతే పక్కన పడేస్తారు. కానీ, శ్రీలీల పూర్తి వ్యక్తిరేకం అనే చెప్పాలి. వరుసగా ఫాప్స్, డిజాస్టర్స్ పడుతున్న ఈ అమ్మడుకు మాత్రం అవకాశాలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. అది కూడా స్టార్ హీరోల సినిమాల్లో. నిజానికి రవితేజతో చేసిన ధమాకా సినిమా తరువాత శ్రీలీలకు ఒక్కటంటే ఒక్క హిట్టు కూడా లేదు. కానీ, వరుసగా స్టార్స్ తో సినిమాలు చేసింది శ్రీలీల.

రీసెంట్ గా తమిళంలో పరాశక్తి సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ, ఆ సినిమా కూడా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో, ఇక శ్రీలీల(Sreeleela) పని అయిపొయింది అనుకున్నారు అంతా. కానీ, ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ దక్కించుకుంది శ్రీలీల. ధనుష్ హీరోగా రీసెంట్ గా కొత్త సినిమా స్టార్ట్ అయ్యింది. అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

Nabha Natesh: నాజూకు నడుమందాలు చూపిస్తూ.. నాభా నటేష్ సోయగం.. ఫొటోలు

ధనుష్ కెరీర్ లో 55వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్టులోకి శ్రీలీలను తీసుకుంటున్నట్టుగా అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. అంతేకాదు ఫోటో కూడా విడుదల చేశారు. దీంతో చాలా మంది అవాక్కవుతున్నారు. ఓపక్క ప్లాప్స్ పడుతున్న శ్రీలీలకు అవకాశాలు ఎలా వస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ సినిమాతో అయినా శ్రీలీల హిట్ ట్రాక్ ఎక్కుతుందా అనేది చూడాలి.

ఇక ప్రస్తుతం శ్రీలీల చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నటిస్తోంది. డైనమిక్ డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన దేఖ్ లేంగే సాలా పాటలో పవన్ తో కలిసి స్టెప్పులు వేసి మెప్పించింది శ్రీలీల.