Sreeleela Mother
Sreeleela Mother : ఇటీవల శ్రీలీల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా అనే టీవీ షోకి వచ్చింది. ఈ షోలో శ్రీలీల అనేక ఆసక్తికర విషయాలు తెలిపింది. ఈ షోకి శ్రీలీల తల్లి కూడా వచ్చి సందడి చేసింది. శ్రీలీల తల్లి ఈ షోలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆసక్తికర విషయం తెలిపింది.(Sreeleela Mother)
జగపతి బాబు ఎన్టీఆర్ చిన్నపుడు కూచిపూడి డ్యాన్స్ వేసిన ఫొటో షోలో చూపించాడు. ఈ ఫొటో చూసి శ్రీలీల తల్లి మాట్లాడుతూ.. తారక్ ని అలా చూసినప్పుడే నాకు అమ్మాయి పుడితే క్లాసికల్ డ్యాన్స్ నేర్పించాలని నేను ఫిక్స్ అయ్యాను. 1997లో మేము అమెరికా లాస్ ఏంజిల్స్ లో ఉండేవాళ్ళం. అక్కడ తానా మీటింగ్స్ జరిగాయి. మేము దానికి అటెండ్ అయ్యాము. అప్పుడు ఆ ఈవెంట్లో తారక్ డ్యాన్స్ చేసాడు. అప్పుడు ఎన్టీఆర్ తో కూడా మాట్లాడాను. అమ్మాయి పుడితే మాత్రం డెఫినెట్ గా ఇలా డ్యాన్స్ చేయిస్తాను అని తారక్ కి చెప్పాను. అమ్మాయి పుడితే ఇలా ట్రెడిషినల్ డ్యాన్స్ చేయించాలని అప్పట్నుంచి నా కోరిక. అందుకే శ్రీలీలకు అన్ని నేర్పించాను అని తెలిపింది.