Sreeleela : కాస్త గ్యాప్ తర్వాత మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన శ్రీలీల.. ఒకేసారి అన్ని సినిమాలా..

శ్రీలీల నితిన్‌తో రాబిన్‌హుడ్, రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తుంది.

Sreeleela movie line up back to back movies with star heroes

టాలీవుడ్ డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరో దగ్గర నుండి మొదలు పెట్టి టైర్ టు హీరోల వరకు చాలా మంది హీరోస్ తో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఈ యంగ్ బ్యూటీ. 2022 నుండి మొదలు పెట్టి 2023 వరకు వరుస సినిమాల్లో నటించిన ఈ భామ 2024లో కాస్త గ్యాప్ తీసుకుంది. ప్రస్తుతం ఆమె ఎంబీబీస్ చేస్తుంది. ఎంబీబీస్ ఎగ్జామ్స్ ఉండడం వల్లే ఆమె ఈ ఏడాది సరిగ్గా సినిమాలు చేయలేదట. ఈ విషయాన్ని స్వయంగా తనే తెలిపింది. ఈ ఏడాది కేవలం గుంటూరు కారం, భగవంత్ కేసరి సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. అలాగే ఇటీవల విడుదలైన పుష్ప 2 సినిమాలో కిస్సిక్ అనే ఐటెం సాంగ్ లో కనిపించింది.

అయితే ఈ ఏడాది పెద్దగా సినిమాలతో అలరించలేక పోయినప్పటికీ వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బ్యూటీ. వచ్చే ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో రాబోతుంది. అలాగే బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. శ్రీలీల నితిన్‌తో రాబిన్‌హుడ్, రవితేజతో మాస్ జాతర, పవన్ కళ్యాణ్‌తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేస్తుంది. ఇక ఈ సినిమాలు 2025లో విడుదలవుతున్నాయి.

Also Read : Sooseki Song : ‘సూసేకి పాటకి అదిరిపోయే స్టెప్పులేసిన కొత్త జంట’.. వీడియో చూసారా..

అలాగే టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య నటించబోయే ఓ సినిమాలో, అఖిల్ చెయ్యనున్న సినిమా, నవీన్ పోలిశెట్టితో ఒక చిత్రం, సిద్ధు జొన్నల గడ్డ చేస్తున్న కోహినూర్ సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలకి సంబందించిన అప్డేట్స్ అన్ని కూడా ఒకదాని వెంట ఒకటి రానున్నాయి. అలా ఈ ఏడాది కాస్త గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ వచ్చే ఏడాది వరుస సినిమాలతో రానుంది.