Sooseki Song : ‘సూసేకి పాటకి అదిరిపోయే స్టెప్పులేసిన కొత్త జంట’.. వీడియో చూసారా..
పుష్ప 2 సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి ఇందులోని సాంగ్స్ బాగా ప్లస్ అయ్యాయని చెప్పాలి.

A new couple dance to sooseki song from pushpa 2 video goes viral
Sooseki Song : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకతంలో తెరకెక్కిన పుష్ప 2 సినిమా ఎంతటి సంచలనాన్ని సృష్టిస్తుందో తెలిసిందే. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఇక నిన్న ఈ సినిమా విడుదలై 11 రోజులు అయ్యింది. కేవలం 11 రోజుల్లో 1400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు బ్రేక్ చేసింది పుష్ప 2.
అయితే పుష్ప 2 సినిమా ఇంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడానికి ఇందులోని సాంగ్స్ బాగా ప్లస్ అయ్యాయని చెప్పాలి. పుష్ప 1 కంటే మించి పుష్ప 2 లో సాంగ్స్ ఉన్నాయి. మొదటి పాట నుండి ఆఖరి పాట వరకు అన్ని యూట్యూబ్ లో మిలియన్ల కొద్దీ వ్యూస్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఈ సాంగ్స్ కి సోషల్ మీడియాలో తమ తమ డ్యాన్సులతో దుమ్ము లేపుతున్నారు నెటిజన్స్.
Also Read : Venu Swamy : ‘త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు.. కానీ’.. వేణు స్వామి సంచలన కామెంట్స్..
అయితే తాజగా ఓ కొత్త జంట పెళ్లి బట్టల్లోనే సూసేకి పాటకి అదిరిపోయే స్టెప్పులు వేశారు. అచ్చం ఆ పాటలో రష్మిక, బన్నీ వేసినట్టే స్టెప్పులు వేశారు నవ వధువు, వరుడు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక సూసేకి పాట నెట్టింట ఎంత రచ్చ లేపిందో తెలిసిందే. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సాంగ్ హవా నడుస్తూనే ఉంది.
View this post on Instagram