Venu Swamy : ‘త్వరలోనే అల్లు అర్జున్ సీఎం అవుతాడు.. కానీ’.. వేణు స్వామి సంచలన కామెంట్స్..
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Venu Swamy Reveals shocking Facts About Allu Arjun Astrology
Venu Swamy : వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ సినీ సెలెబ్రిస్ పై వివాదాస్పద జాతకాలు చెప్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఈయన. ఇక సోషల్ మీడియాలో ఈయనకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. నార్మల్ జనం నుండి మొదలు పెడితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు ఈయన్ని నమ్మే వారు చాలా మంది ఉన్నారు. ఇప్పటికే చాల మంది సినీ హీరోయిన్స్ ఆయన దగ్గర కొన్ని పూజలు కూడా చేశారు.
అయితే సమంత, నాగచైతన్య విడాకుల వార్తల దగ్గర నుండి మొదలైన ఈయన ప్రయాణం ఇప్పుడు అల్లు అర్జున్ వరకు చేరింది. ఎన్నో వివాదాస్పద జాతకాలు చెప్పిన ఈయన తాజాగా అల్లు అర్జున్ సంధ్య థియేటర్ ఘటన కారణంగా జైలుకి వెళ్లి వచ్చిన విషయంపై షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు జైలుకు వెళ్లిన వాళ్లందరూ ముఖ్యమంత్రులు అయ్యారు.. కాబట్టి, అల్లు అర్జున్ కూడా భవిష్యత్తులో కచ్చితంగా సీఎం అవుతాడు. ఇప్పటికే అలా జైలుకు వెళ్లిన జగన్ సీఎం అయ్యారు.. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా జైలుకు వెళ్లి వచ్చాక సీఎం అయ్యాడు. ఇప్పుడు కూడా అదే విధంగా బన్నీ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు వేణు స్వామి. ఇప్పుడున్న దానికంటే 100 రెట్లు ఫైర్ తో అల్లు అర్జున్ సీఎం అవుతాడు. కచ్చితంగా ఎప్పుడు అవుతాడు, ఏ రాష్ట్రానికి అవుతాడు అన్నది నేను చెప్పను.. మీరే చూడండి” అంటూ సంచలన కామెంట్స్ చేసాడు.