Sreeleela : టాలీవుడ్ గడ్డ శ్రీలీల అడ్డా.. పవన్ నుంచి విజయ్ వరకు..

ధమాకాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్ లో అరడజనుకు పైగా సినిమాల్లో నటిస్తుంది.

Sreeleela tollywood movies list Ustaad Bhagat Singh SSMB28 VD12

Sreeleela : కన్నడ సినిమాలతో వెండితెరకు పరిచయమైన శ్రీలీల.. టాలీవుడ్ కి పెళ్ళిసందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో అల్లరి పిల్లగా అందర్నీ అలరించింది. ఆ తరువాత రవితేజ పక్కన ధమాకా సినిమాలో నటించి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఈ మూవీలో శ్రీలీల యాక్టింగ్ అండ్ డాన్స్ లకు టాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయ్యిపోయారు. తెలుగులో నటించిన రెండో సినిమానే 100 కోట్లు రాబట్టడంతో టాలీవుడ్ మేకర్స్ కూడా ఆమెను తమ ప్రాజెక్ట్ లకు లాక్ చేస్తున్నారు.

Ustaad Bhagat Singh : ఉస్తాద్ భగత్ సింగ్ సెకండ్ షెడ్యూల్ షురూ.. యాక్షన్ పార్ట్!

దీంతో ప్రస్తుతం శ్రీలీల చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి. యంగ్ హీరో నితిన్, వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న Nithiin32 మూవీ, యంగ్ సెన్సేషన్ నవీన్ పోలిశెట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే రామ్, బోయపాటి కలయికలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ లో, మెగా హీరో పంజా వైష్ణవ తేజ్ నటిస్తున్న PVT04 సినిమాలో కూడా కథానాయికగా కనిపించబోతుంది.

SSMB28: బసిరెడ్డిని మించిన విలన్.. మహేష్‌తో మామూలుగా ఉండదంటున్న జగపతి బాబు!

ఇక టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీస్ అయిన పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh), మహేష్ బాబు SSMB28, బాలకృష్ణ NBK108 సినిమాల్లో కూడా నటించే అవకాశం దక్కించుకొని దూసుకుపోతుంది. రెండు సినిమాలతోనే పవన్, మహేష్ కి హీరోయిన్ గా నటిస్తుండడంతో ఇతర టాలీవుడ్ మేకర్స్ కూడా ఈ అమ్మడి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాలో నటించే అవకాశం కూడా కొట్టేసింది.

Vijay Devarakonda : సడెన్ గా కొత్త సినిమా ఓపెనింగ్ చేసి ఆశ్చర్యపరిచిన రౌడీ హీరో.. ఈసారి శ్రీలీలతో..

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ VD12 నిన్న పూజ కార్యక్రమాలతో మొదలైంది. వీటితో పాటు కన్నడలో కూడా జూనియర్ అనే సినిమాలో నటిస్తుంది. మరి చేతి నిండా క్రేజీ ప్రాజెక్ట్స్ తో ఉన్న శ్రీలీల బాక్స్ ఆఫీస్ వద్ద ఎటువంటి విజయాలను నమోదు చేస్తుందో. వీటిలో ఏ రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసినా శ్రీలీల టాలీవుడ్ టాప్ చైర్ ని సొంతం చేసుకోవడం ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు.