Sreerama Chandra: శ్రీరెడ్డితో శ్రీరామ్.. మరోసారి వైరల్‌గా మారిన చాటింగ్!
సినీ నటి శ్రీరెడ్డి ఆ మధ్య పేల్చిన బాంబులు గుర్తుండే ఉంటాయి. దాదాపు నాలుగేళ్ళ కిందట టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందని ఇండస్ట్రీలో కలకలం రేపిన శ్రీరెడ్డి..
- Naresh Mannam
- Published On : November 7, 2021 / 07:40 PM IST
Sreerama Chandra (1)
Sreerama Chandra: సినీ నటి శ్రీరెడ్డి ఆ మధ్య పేల్చిన బాంబులు గుర్తుండే ఉంటాయి. దాదాపు నాలుగేళ్ళ కిందట టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పెరిగిపోయిందని ఇండస్ట్రీలో కలకలం రేపిన శ్రీరెడ్డి ఎప్పుడు ఏ రోజు ఎవరి బతుకుని బస్టాండ్ చేస్తుందో అర్ధంకాక ఆ మధ్య చాలామంది సెలబ్రిటీలు వణికిపోయారు. అసలు వాళ్ళు చేశారా లేదా అనేదాని కన్నా శ్రీరెడ్డి నోటి నుండి తమ పేరు బయటకి వస్తే లేనిపోని రచ్చ అవుతుందని ఆందోళన కనిపించింది. అందుకు తగ్గట్లే ఆ మధ్య యంగ్‌హీరోలు, సినీ డైరెక్టర్‌మీద ట్వీట్లతో దుమారం రేపిన శ్రీరెడ్డి శేఖర్ కమ్ముల లాంటి దర్శకుల పేర్లను కూడా వాడేసింది.
Katrina Kaif-Vicky Kaushal: ఒక్కటవుతున్న క్యాట్-విక్కీ.. పెళ్లెప్పుడంటే?
ఇక నటులు, దర్శకులే కాదు సింగర్స్ పేర్లను కూడా బయటపెట్టిన శ్రీరెడ్డి ముఖ్యంగా ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామచంద్రను టార్గెట్ చేసి చూడండి తనతో చేసిన చాటింగ్ అంటూ బయటపెట్టింది. చూడండి ఇండియన్ ఐడల్ చాట్ అంటూ షేమ్ ఆన్ యూ శ్రీరామ్ అంటూ అప్పుడు చాటింగ్ తో పాటు తనతో శ్రీరామ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలను కూడా శ్రీరెడ్డి లీక్ చేసింది. అయితే, అందులో శ్రీరెడ్డి రెచ్చగొట్టినట్లుగా ఉండడంతో కొందరు శ్రీరామ్ కు మద్దతుగా కూడా నిలిచారు. ఇదంతా నాలుగేళ్ళ కిందట వ్యవహారం.
Deepthi Sunaina: లెహంగా చోళీలో సునయన కిరాక్ పోజులు!
కాగా, ఇప్పుడు మరోసారి ఈ చాటింగ్, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. శ్రీరామ్ ప్రస్తుతం బిగ్ బాస్ ఐదవ సీజన్ లో టైటిల్ ఫెవరెట్ కంటెస్టెంట్ గా మారాడు. షో మొదలైన కొత్తలో కాస్త డల్ గా కనిపించిన శ్రీరామ్ కూల్ గా ఆడుతూ షోలో హాట్ ఫెవరెట్ గా మారిపోయాడు. దీంతో ఇప్పుడు శ్రీరామ్ అంటే గిట్టని కొందరు పనిగట్టుకొని గతంలో శ్రీరెడ్డి లీక్ చేసిన చాటింగ్, ఫోటోలు వైరల్ చేస్తున్నారు. ఏది ఏమైనా బిగ్ బాస్ షోలో శ్రీరామ్ గట్టిపోటీ ఇవ్వడం ఇప్పుడు శ్రీరామ్ గతాన్ని తవ్వడం ఆసక్తిగా మారింది.
