Mailu Rayi : నిర్మాతగా మరో మహిళ.. నాగబాబు చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్..
ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు విడుదల చేశారు. (Mailu Rayi)
- Saketh U
- Published on- October 29, 2026 / 04:37 PM IST
Nagababu
Mailu Rayi : జగన్ యోగిరాజు, నవ్య చిట్యాల జంటగా తెరకెక్కుతున్న సినిమా మైలురాయి. హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై శ్రీ హన్సిక పెద్దిరెడ్డి నిర్మాణంలో తవిటిరాజు తలచింతల సహ నిర్మాతగా రఘువర్ధన్ కోట్ల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దేవీ ప్రసాద్, లక్ష్మణ్ మీసాల, పవన్ రమేష్, సునందిని, అంజు వాల్గుమన్.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను నటుడు, నిర్మాత, ఏపీ శాసనమండలి సభ్యుడు, ఏపీ గ్రీన్ ఛైర్మన్ నాగబాబు విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. సినిమా టైటిల్ మైలురాయి ఆసక్తికరంగా ఉంది. నిర్మాత హన్సిక మంచి సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించారు. ఫిల్మ్ మేకింగ్‌లో మహిళలకు ఉండే బాధ్యత, క్రమశిక్షణ ఎంతో గొప్పవి. ఇప్పటికే అశ్వనీదత్ గారి కుమార్తెలు స్వప్న దత్, ప్రియాంక దత్, నా కుమార్తె నిహారిక, సుప్రియ యార్లగడ్డ.. లాంటి వాళ్ళు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హన్సిక కూడా వారి బాటలోనే గుర్తింపు తెచ్చుకొని విజయాలు సాధించాలి అని అన్నారు.
Also See : Aadarsha Kutumbam : ఆదర్శ కుటుంబం ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్.. ఫొటోలు..
నిర్మాత శ్రీ హన్సిక పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. మా హన్సి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా తెరకెక్కుతున్న మైలురాయి సినిమా టైటిల్ లాంచ్ పోస్టర్‌ను నాగబాబు గారి చేతుల మీదుగా విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే టీజర్, పాటలను రిలీజ్ చేస్తాం అని తెలిపారు.
