దేశవ్యాప్తంగా అత్యచారాలు పెరిగిపోయిన క్రమంలోనే దర్శకనిర్మాతలు సమాజంలో ఆడవారిపై జరుగుతున్న హత్యాచారాల నేపథ్యంలో సినిమాలు తీసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అటువంటి కథాంశంతో తీసిన సినిమా ‘శ్రీరెడ్డి దొరికిపోయింది’.
ఎస్ఎస్ఆర్ ఆర్యన్, ఉపాసన హీరోహీరోయిన్లుగా రాహుల్ పరమహంస దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ `కరుతుకలై పతివు సెయ్`. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులో యశ్వంత్ మూవీస్ పతాకంపై శ్రీరెడ్డి దొరికిపోయింది అనే టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. మానవమృగాలకు అనేది సినిమా టాగ్‌లైన్. నిర్మాత డి. వెంకటేశ్ ఈ సినిమాని విడుదల చేస్తున్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలతో సినిమా ఫస్ట్ లుక్‌ని చిత్ర యూనిట్ లేటెస్ట్‌గా విడుదల చేసింది.
ఈ సంధర్భంగా చిత్ర నిర్మాత డి. వెంకటేశ్ మాట్లాడుతూ.. తమిళ్‌లో పెద్ద విజయం సాధించిన ఈ చిత్రాన్ని మా బేనర్‌లో విడుదల చేయడం సంతోషంగా ఉంది. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. వాటికి గల కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రతలు ఈ మూవీలో చూపించడం జరిగిందని అన్నారు. తెలుగు నేటివిటికి తగ్గట్లు మాతృకలో కొన్ని మార్పులు చేసినట్లు వెల్లడించారు.
జీతన్2 లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ తెరకెక్కించిన రాహుల్ దర్శకత్వంలో వస్తోన్న మూవీ కావడంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. టైటిల్ కి మంచి రెస్పాన్స్ వస్తోందని అన్నారు.
ఎస్ఎస్ఆర్ ఆర్యన్, ఉపాసన హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి రాహుల్ పరమహంస దర్శకత్వం వహించగా గణేశ్ రాఘవేంద్ర సంగీతం అందించారు. మనోహర్ సినిమాటోగ్రఫి, సాయి సతీశ్ పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు.