Sri Vidya : నాన్న చిన్నప్పుడే చనిపోయారు.. నేను హైదరాబాద్ వస్తే అమ్మని చాలా మాటలు అన్నారు.. శ్రీ విద్య ఎమోషనల్..

తన పేరెంట్స్ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది. (Sri Vidya)

  • Published on- November 16, 2026 / 06:34 PM IST

Sri Vidya

Sri Vidya : యాంకర్ గా కెరీర్ మొదలుపెట్టి జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న శ్రీవిద్య ఇప్పుడు నటిగా మారింది. ఇటీవలే లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే వెబ్ సిరీస్ తో మంచి విజయం సాధించి పాపులారిటీ తెచ్చుకుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్తూ ఈ క్రమంలో తన పేరెంట్స్ గురించి చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Sri Vidya : ఊరి నుంచి హైదరాబాద్ వచ్చి.. ఆ పనులతో అమ్మాయిలు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు.. శ్రీవిద్య వ్యాఖ్యలు వైరల్..

శ్రీ విద్య మాట్లాడుతూ.. మా నాన్నకు పక్షవాతం వచ్చి నా చిన్నప్పుడే చనిపోయారు. అందరూ మమ్మల్ని హాస్టల్ లో వేసి ఇంకో పెళ్లి చేసుకోమన్నారు మా అమ్మని. కానీ మా కోసం చేసుకోలేదు. కానీ ఇప్పుడు హాస్టల్ లోనే ఉంటున్నా. నేను హైదరాబాద్ వచ్చాక రోజు మా అమ్మ తను పనిచేసే స్కూల్ కి వెళ్తుంటే దారిలో తండ్రి లేని పిల్ల అలా హైదరాబాద్ లో వదిలేసారు, తను ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది, ఎక్కడ తిరుగుతుంది తెలీదు కదా అని అమ్మని అడిగేవాళ్ళు. అమ్మని చాలా మాటలు అన్నారు. కానీ మా అమ్మని నా గురించి అలా అన్న వాళ్ళే ఇప్పుడు నా సిరీస్ చూసి బాగా చేసింది మీ అమ్మాయి అని అడుగుతున్నారు. అమ్మ హ్యాపీగా ఉంది.

మా అమ్మ చాలా సార్లు చెప్పింది నువ్వు ఆడపిల్లవి, ఎందుకు అక్కడ ఒంటరిగా, నేను చూసుకుంటాను, పెళ్లి చేస్తా వచ్చేయి అని. అమ్మానాన్న ఇద్దరూ ఉండాలి ఒక్కరు లేకపోయినా బాధ ఉంటుంది. మా నాన్న ఉంటె యూనివర్సిటీలో చదువుకునేదాన్నేమో, జాబ్ చేసేదాన్నేమో. నాన్న ఉంటె ఇక్కడ రూమ్స్ లో ఉండి కష్టపడేదాన్ని కాదేమో అని అనుకునేదాన్ని. కానీ వేరే వాళ్లకు లేవని నేను బాధపడను. నాకు కావాలి అంటే నేను కష్టపడాలి అని నాకు తెలుసు. హైదరాబాద్ కి మొదటిసారి జబర్దస్త్ కోసం వచ్చినప్పుడు రెండు వేలతో వచ్చాను. అయిదొందలు పోయాయి. మూడు రోజుల్లో మిగిలిన డబ్బులు అయిపోయాయి. జబర్దస్త్ లో వేరే చిన్న ఆర్టిస్టుల రూమ్ లో ఒక రోజు తలదాచుకుందాం అనుకున్నా ఎవరు సపోర్ట్ చేయలేదు. ఆ రోజు రాత్రి రైల్వే స్టేషన్ లోనే ఉండి రాత్రి 2 గంటలకు ట్రైన్ ఎక్కేసి మా ఊరు వెళ్ళిపోయాను. అప్పుడు నాకు డబ్బుల విలువ తెలిసింది అని చెప్తూ ఎమోషనల్ అయింది.

Also Read : Teja Sajja : ఘనంగా తేజ సజ్జా నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్..