×
Ad

Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా ‘ప్రభల తీర్థం’.. త్వరలోనే అధికారిక ప్రకటన

'ప్రభల తీర్థం' బ్యాక్డ్రాప్ లో కొత్త సినిమాను ప్లాన్ చేస్తున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala).

Srikanth Addala making films with Prabhala Teertham backdrop.

  • చాలా గ్యాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాల కొత్త సినిమా
  • ‘ప్రభల తీర్థం’ బ్యాక్డ్రాప్ లో సరికొత్తగా
  • త్వరలోనే అధికారిక ప్రకటన

Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ పేరు గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొత్త బంగారు లోకం సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. కానీ, ఈ రెండు హిట్స్ ఇచ్చిన ఆ ఫేమ్ ను నిలుపుకోలేకపోయాడు శ్రీకాంత్ అడ్డాల(Srikanth Addala). ఆ తరువాత చేసిన ముకుంద, బ్రహ్మోత్సవం, పేదకాపు సినిమాలు డిజాస్టర్ అయ్యాయి.

Neha Shetty: ట్రెండీ డ్రెస్ లో రాధిక.. ఓరచూపుతో కవ్విస్తుందిగా.. ఫొటోలు

దాంతో చాలా గ్యాప్ తీసుకున్న ఈ దర్శకుడు మరోసారి సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. అదే ‘ప్రభల తీర్థం’. గోదావరి, కొనసీమ ప్రాంతాల్లో జరిగే ప్రముఖ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ‘ప్రభల తీర్థం’ ఒకటి. భక్తి భావం, త్యాగం చుట్టూ ఈ ప్రబల తీర్ధం మేళవించి ఉంటుంది. అందులో కూడా మానవ సంబంధాలు, భావోద్వేగాలతో కూడిన ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. సంక్రాంతి సమయంలో జరిగే ఈ ప్రభల తీర్ధం ఉత్సవాలకు చాలా విశిష్టత ఉంది.

అందుకే, ఆ కథాంశంలో తన కొత్త సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నాడట శ్రీకాంత్ అడ్డాల. అది కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతానికి సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు, భక్తి పరమైన అంశాలతో కూడిన సినిమాలు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటాయి. అందుకే, ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించడానికి సిద్ధం అయ్యాడట శ్రీకాంత్ అడ్డాల. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుకానుంది అని సమాచారం. అయితే, ఈ సినిమాలో నటించే హీరో, హీరోయిన్స్ గురించి ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.