Srikanth - Roshan
Srikanth – Roshan : ఒకప్పటి హీరో శ్రీకాంత్ ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నాడు. ఇక శ్రీకాంత్ కొడుకు హీరోగా సినిమాలు చేస్తున్నాడు. రోషన్ నిన్నే ఛాంపియన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సినిమా పర్లేదు అనిపించినా రోషన్ మాత్రం తన యాక్టింగ్ తో అదరగొట్టాడు. గత సంవత్సరం రోషన్ ఓ పాన్ ఇండియా సినిమాలో కీలక పాత్ర చేస్తున్నాడు అని ప్రకటించారు కానీ ఆ సినిమా నుంచి రోషన్ తప్పుకున్నాడు అని వార్తలు వచ్చాయి.(Srikanth – Roshan)
రోషన్ తప్పుకున్న సినిమా పేరు వృషభ. మలయాళం స్టార్ మోహన్ లాల్ హీరో. మోహన్ లాల్ హీరోగా రోషన్ కీలక పాత్రలో గత సంవత్సరం వృషభ అనే పాన్ ఇండియా సినిమా రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా నిన్నే డిసెంబర్ 25న రిలీజయింది. ఈ సినిమా చూసిన తర్వాత రోషన్ ఈ సినిమా వదిలేసి మంచి పని చేసాడు అని అంతా అంటున్నారు.
Also See : Murari Working Stills : మహేష్ బాబు ‘మురారి’.. క్లైమాక్స్ షూట్ వర్కింగ్ స్టిల్స్ చూశారా..?
పాత కథ, సంబంధం లేని సీన్స్, క్వాలిటీ లేని అవుట్ పుట్, అక్కర్లేని పాటలు, సరిగా పండని ఎమోషన్.. ఇవన్నీ పెట్టుకొని ఒక రాడ్ సినిమాలా ఉందని, అసలు ఈ సినిమాని మోహన్ లాల్ ఎలా ఒప్పుకున్నాడు ప్రేక్షకులు అంటున్నారు. వృషభ సినిమాలో రోషన్ మాత్రమే కాదు, శ్రీకాంత్ కూడా ఉన్నాడట.
శ్రీకాంత్ – రోషన్ ఓ ఇరవై రోజులు ఈ సినిమా కోసం షూటింగ్ కూడా చేశారట. ప్రస్తుతం ఈ సినిమాలో నటుడు అజయ్ చేసిన పాత్రకు శ్రీకాంత్ ని తీసుకున్నారట. కానీ సినిమా కథ ఒకలా చెప్పి సినిమా సరిగ్గా తీయకపోవడంతో మధ్యలోనే మూవీ యూనిట్ తో గొడవపడి ఆ సినిమా నుంచి తండ్రీకొడుకులు శ్రీకాంత్ – రోషన్ బయటకు వచ్చేశారని టాలీవుడ్ సమాచారం. నిన్న వృషభ – ఛాంపియన్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడంతో టాలీవుడ్ లో ఈ విషయాలు చర్చగా మారాయి. మొత్తానికి రోషన్ అయితే వృషభ సినిమా వదులుకొని మంచి పని చేసాడు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు కూడా. ఇటీవల ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ లో కూడా వృషభ సినిమా గురించి అడిగితే దాని గురించి మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు రోషన్.
Also See : Jabardasth Varsha : జబర్దస్త్ వర్ష బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫోటోలు చూశారా..?