బిగ్‌బాస్ సీజన్ 3లో కంటెస్టెంట్ గా ఉన్న శ్రీముఖికి సంబంధించి కొత్త వివాదం తెరపైకి వచ్చింది. శ్రీముఖి పై ఓ ఇంగ్లీష్ పేపర్ తప్పుడు వార్తలు రాస్తోందని శ్రీముఖి తమ్ముడు సుశ్రుత్ జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశాడు. బిగ్ బాస్ షోలో శ్రీముఖిని మాత్రమే టార్గెట్ చేసి ఆమెకు నెగిటీవ్ గా ప్రచారం చేస్తున్నారని తెలిపారు.
అంతేకాకుండా ఆ న్యూస్ పేపర్ వాళ్లే నకిలీ సోషల్ మీడియా అకౌంట్లను క్రియేట్ చేసి శ్రీముఖిపై కామెంట్లు చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. గత రెండు వారాల నుంచి ఈ వార్తలు మరింత ఎక్కువ కావడంతో ఓపిక పోయింది. అందుకే ఈ విషయాన్ని పోలీసుల దగ్గరకి తీసుకెల్లాల్సి వచ్చిందని సుశ్రుత్ తెలిపారు.
ఇక బిగ్ బాస్ హౌస్ లో గొడవలు..సరదాలు.. కామన్. ఒక రోజు అరుపులతో ఎపిసోడ్ సాగింది అంటే కచ్చితంగా నెక్స్ట్ ఎపిసోడ్ సరదాగా సాగుతోందని అందరికీ తెలిసిన విషయమే. ప్రస్తుతం ఇంటి సభ్యుల చేత బిగ్ బాస్ ‘చలో ఇండియా’ టాస్క్ ఆడిస్తున్నాడు.
A reputed media being involved in wrong/paid article publication based on tweets made by fake accounts. @toitv TIMES OF INDIA . #TeamSreeMukhi #sreemukhi #timesofindia #BiggBoss3Telugu #toi pic.twitter.com/Yn59Etk8Qi
— SreeMukhi (@MukhiSree) August 29, 2019