Srinu Vaitla Gopichand movie first schedule starts at italy
Gopichand 32 : టాలీవుడ్ డైరెక్టర్ శ్రీను వైట్ల చాలా గ్యాప్ తరువాత మాచో స్టార్ గోపీచంద్ తో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. ఇటీవలే ఈ మూవీని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. ఆ తరువాత వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేసి శరవేగంగా ముందుకు తీసుకువెళ్లారు. ఈక్రమంలోనే శ్రీనువైట్ల మొన్న లొకేషన్స్ కోసం ఇటలీ వెళ్లి అక్కడ కొన్ని ప్లేస్ లు ఫైనల్ చేశాడు. తాజాగా ఇప్పుడు మరో క్రేజీ అప్డేట్ ని ఇచ్చాడు. ఈ మూవీ షూటింగ్ ని మొదలుపెట్టినట్లు ఒక వీడియో ద్వారా తెలియజేశాడు.
ఇటలీలోని మిలన్ లో మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేసినట్లు శ్రీనువైట్ల తెలియజేశాడు. మూవీలోని కొన్ని కీ సీన్స్ ని అక్కడ షూట్ చేయబోతున్నాడు. కాగా ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనేది ఇంకా తెలియజేయలేదు. చిత్రాలయం స్టూడియోస్ పతాకం పై మొదటి ప్రొడక్షన్ గా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి ‘విశ్వం’ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మూవీ టీం నుంచి దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Also Read : Saindhav : సంక్రాంతి బరిలో వెంకీ మామ.. ఈసారి పొంగల్ పోటీ మాములుగా లేదుగా..
కాగా గోపీచంద్ అండ్ శ్రీను వైట్ల ఇద్దరు ప్లాప్ ల్లోనే ఉన్నారు. మరి ఈ సినిమాతో ఇద్దరు మంచి కామ్‌బ్యాక్ ఇస్తారా లేదా చూడాలి. అయితే గోపీచంద్ ఈ సినిమా కంటే ముందే ‘భీమ’ అనే చిత్రాన్ని తీసుకు వస్తున్నాడు. కన్నడ డైరెక్టర్ హర్ష తెరకెక్కిస్తున్న ఈ మూవీలో గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనపడబోతున్నాడు. ఈ మూవీ రిలీజ్ డేట్ ని ఇంకా అనౌన్స్ చేయలేదు. కన్నడలో వరుస బ్లాక్ బస్టర్స్ ఉన్న హర్ష.. గోపీచంద్ కి ఎలాంటి విజయాన్ని అందిస్తాడో చూడాలి.
— Sreenu Vaitla (@SreenuVaitla) October 5, 2023