Saindhav : సంక్రాంతి బరిలో వెంకీ మామ.. ఈసారి పొంగల్ పోటీ మాములుగా లేదుగా..

సంక్రాంతికి కలుదాం అంటున్న వెంకటేష్. 'సైంధవ్' పోస్టుపోన్ అండ్ న్యూ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసిన..

Saindhav : సంక్రాంతి బరిలో వెంకీ మామ..  ఈసారి పొంగల్ పోటీ మాములుగా లేదుగా..

Venkatesh announced Saindhav will come in sankranti 2024

Updated On : October 5, 2023 / 11:38 AM IST

Saindhav : విక్ట‌రీ వెంకటేశ్ తన 75వ సినిమాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘సైంధవ్‌’. హిట్ ఫేం శైలేష్‌ కొలను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ.. ఆల్మోస్ట్ చివరిలో దశలో ఉంది. కాగా ఈ సినిమాని క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 22న రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ డేట్ దగ్గరకి ప్రభాస్ ‘సలార్’ వచ్చి చేరడంతో ఈ మూవీని పోస్టుపోన్ వేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. క్రిస్టమస్ నుంచి సంక్రాంతి పండక్కి షిఫ్ట్ చేస్తున్నట్లు టాక్ వినిపించింది.

తాజాగా మూవీ టీం ఈ వార్తని నిజం చేసింది. ఈ సినిమాని సంక్రాంతి బరిలో నిలపబోతున్నారు. జనవరి 13న కలుదామంటూ వెంకటేష్ అధికారికంగా నేడు ప్రకటించారు. ఇక పోస్టుపోన్ అయినందుకు అభిమానులు కొంత నిరాశ చెందినప్పటికీ సంక్రాంతి బరిలోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక వెంకటేష్ కెరీర్ లో ఇది ల్యాండ్ మార్క్ మూవీ కావడంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. విక్రమ్, జైలర్ తరహాలో ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్ గా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

Also Read : Chiranjeevi : 50 ఏళ్ళ ప్రయాణం పూర్తి చేసుకున్న సినీ ప్రముఖుడు.. చిరు ఎమోషనల్ పోస్ట్..

కాగా సంక్రాంతి బరిలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చి చేరాయి. మ‌హేశ్ బాబు ‘గుంటూరు కారం’, తేజా సజ్జా ‘హ‌నుమాన్‌’, ర‌వితేజ ‘ఈగ‌ల్‌’ డేట్స్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇక నాగార్జున ‘నా సామిరంగ’, విజ‌య్ దేవ‌ర‌కొండ ‘VD13’, రజినీకాంత్ ‘లాల్ సలామ్’ సినిమాలు డేట్ అనౌన్స్ చేయకున్నా సంక్రాంతికే వస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం మీద ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ ఓరేంజ్ లో ఉండేలా కనిపిస్తుంది. మరి ఈ చిత్రాలు అన్ని చెప్పినట్లు పండక్కే వస్తారా? లేదా వెనక్కి తగ్గుతారా? అనేది చూడాలి.