Srivalli
Pushpa Craze: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘పుష్ప: ది రైజ్’. ఈ సినిమా మ్యాజిక్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఏదో రకంగా వైరల్ అవుతూనే ఉంది. సినిమా తారలు, క్రికెటర్లు ఈ సినిమా డైలాగులు, పాటలపై రీళ్లు, ఫన్నీ వీడియోలను రూపొందించగా.. క్రేజ్ విపరీతంగా వచ్చేసింది.
లేటెస్ట్‌గా పుష్పలోని సూపర్ హిట్ సాంగ్ శ్రీవల్లి పాటను ఓ భజనలో కూడా వాడేశారు. ఓ బృందం భజన కీర్తనలో శ్రీవల్లి పాటను గానం చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ భజన బృందం పుష్ప శ్రీవల్లి పాటకు తబలా దరువు, ఢోలక్ టెంపోతో మ్యూజిక్ అందించారు. మంజీర్ మిణుకు మిణుకు మిణుకుమంటూ శ్రీవల్లి భజన వెర్షన్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోని సోషల్ మీడియాలో విపరీతంగా ఇష్టపడుతున్నారు. నెటిజన్లు ఈ వీడియోను విపరీతంగా లైక్ చేస్తున్నారు. షేర్ చేస్తున్నారు.