Sriya Reddy Learning Kalari Payattu Photos goes Viral
Sriya Reddy : మన సెలబ్రిటీలు సినిమాలో పాత్ర కోసం ఏ విద్య అయినా కష్టపడి నేర్చుకుంటారు. ప్రస్తుతం నటి శ్రియారెడ్డి కలరిపయట్టు నేర్చుకుంటుంది.
తమిళ భామ శ్రియారెడ్డి ఇటీవల సలార్ సినిమాలో రాధా రమా మన్నార్ పాత్రలో నటించి అదరగొట్టింది. త్వరలో పవన్ OG సినిమాలో కూడా కనిపించబోతుంది.
తాజాగా శ్రియారెడ్డి కేరళ ఫేమస్ విద్య అయిన కలరిపయట్టు నేర్చుకుంటుంది.
శ్రియారెడ్డి కష్టపడి కలరిపయట్టు నేర్చుకుంటున్న ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
దీంతో ఈ సినిమా కోసం శ్రియారెడ్డి ఇంతకష్టపడి ఇప్పుడు ఈ విద్య నేర్చుకుంటుందో అని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఫొటోలతో పాటు కలరిపయట్టు కోసం శ్రియారెడ్డి కష్టపడుతున్న ఓ వీడియో కూడా షేర్ చేసింది. దీంతో ఈమెని ఫ్యాన్స్, నెటిజన్లు అభినందిస్తున్నారు.