SS Rajamouli And RamCharan reaction on konda surekha comments
Ramcharan-Rajamouli : అక్కినేని ఫ్యామిలీ, సమంతపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ సినీనటులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇప్పటికే నాగార్జున, నాగచైతన్య, సమంత, అమల, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, విజయ్ దేవరకొండ వంటి సెలబ్రెటీలు మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
తాజాగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు నిరాధార ఆరోపణలుగా కొట్టిపారేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. దర్శకుడు జక్కన్న ట్విట్టర్ వేదకగా ‘‘హుందాతనాన్ని నిలబెట్టుకోండి. గౌరవప్రదంగా వ్యవహరించండి. ప్రభుత్వ ప్రతినిధులుగా ఇలాంటి నిరాధార ఆరోపణలు సహించలేనివి’’ అని ట్వీట్ చేశారు. అంతేకాదు.. #FilmIndustryWillNotTolerate (ఫిల్మ్ ఇండస్ట్రీ సహించదు) అనే హ్యాష్‌ట్యాగ్ కూడా యాడ్ చేశారు.
Respect boundaries, maintain dignity. Baseless allegations are intolerable, especially when made by public officials!#FilmIndustryWillNotTolerate
— rajamouli ss (@ssrajamouli) October 3, 2024
రామ్ చరణ్ కూడా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆమె వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యమైనవిగా పేర్కొన్నారు. ఒక రాజకీయ నేత ఇలా అసభ్యకరంగా మాట్లాడడం దిగ్భ్రాంతికరం. ఆమె ఆరోపణలు నిరాధారమైనవి. సామాజిక విలువలను దెబ్బతీసేలా ఉన్నాయి. ఇలాంటి అనుచిత వ్యాఖ్యలను సినీ ఇండస్ట్రీ ఎప్పటికీ సహించదు’’ అని పోస్టు పెట్టారు.
— Ram Charan (@AlwaysRamCharan) October 3, 2024
రాజకీయ లబ్ధికి సెలబ్రెటీలను లక్ష్యంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని టాలీవుడ్ నిర్మాతలు, హీరోలు, దర్శకులు సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. అక్కినేని ఫ్యామిలీ కూడా మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తమ కుటుంబ గౌరవం, ప్రతిష్ఠ దెబ్బతీసేలా మంత్రి సురేఖ వ్యాఖ్యలు చేశారని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే, తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ఆమె మీడియా ద్వారా వెల్లడించారు.
Read Also : Film Chamber : మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందించిన ఫిలిం ఛాంబర్..