‘బ్రహ్మాస్త్ర’ తెలుగు లోగో రిలీజ్ చేసిన ఎస్ఎస్ రాజమౌళి

  • Publish Date - March 12, 2019 / 12:30 PM IST

బాలీవుడ్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మాత కరణ్ జోహర్ రూపొందిస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాలో కింగ్ నాగార్జున, బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రణబీర్ కపూర్, అలియా భట్ కూడా ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. ఈ చిత్రం తెలుగులోకి డబ్ అవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు లోగోను ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశాడు.

ఈ మేరకు రాజమౌళి ఈ సినిమా లోగోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ’దేశంలోనే తొలి మైథికల్ ఫ్యుజన్ డ్రామా ట్రయాలజీ బ్రహ్మాస్త్ర సినిమా మోషన్ లోగోను విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన నటీనటులు, సాంకేతిక నిపుణులతో సినిమా రూపొందుతున్నది. దర్శకుడు ఆయన్, నిర్మాత కరణ్‌కు విజయం చేకూరాలి’ అని రాజమౌళి ట్వీట్‌ చేశాడు.

ఈ మధ్య కాలంలో రాజమౌళి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. అలాగే కరణ్ జోహార్ కి రాజమౌళి కి మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. రాజమౌళి క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని కరణ్ ఈ సినిమా లోగో టీజర్ ని జక్కన్నతో విడుదల చేయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాహుబలి సినిమాని హిందీలో ధర్మ ప్రొడక్షన్ బ్యానర్‌పై కరణ్ జోహార్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల రాజమౌళి, ప్రభాస్, రానాను తన కాఫీ విత్ కరణ్ షోకు ఆహ్వానించిన సంగతి విధితమే. ఇక ఇవన్ని అతని సినిమాకి ప్లస్ అనే చెప్పుకోవాలి. ప్రస్తుతానికి రాజమౌళి ట్విట్ నెట్టింట్లో వైరల్ గా మారింది.