Mahesh Babu : మహేష్ బాబు కొత్త లుక్ చూసారా.. లేజర్ ఫోకస్ అంటూ..

మహేష్ బాబు కొత్త లుక్ చూసారా. ఈ కొత్త లుక్ SSMB29 కోసమేనా..?

SSMB29 star Mahesh Babu shares his new look in instagram gone viral

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కబోయే ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని మహేష్ అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు క్యూరియాసిటీతో ఉన్నారు. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫుల్ స్వింగ్ లో సాగుతున్నాయి. ఈ వర్క్స్ లోనే మహేష్ బాబు లుక్ గురించి కూడా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

ఈక్రమంలోనే రాజమౌళి ఒక ఎనిమిది లుక్ డిజైన్స్ ని స్కెచ్ చేయించారట. వాటిలో మహేష్ కి ఏది సెట్ అయితే.. దానిని ఫైనల్ చేయనున్నారట. మరి జక్కన్న ఏ లుక్ ని ఫైనల్ చేశారో తెలియదు గాని.. మహేష్ బాబు ఇప్పుడు ఓ కొత్త లుక్ తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. తన ఇన్‌స్టాగ్రామ్ లో లేజర్ ఫోకస్ అంటూ మహేష్ కొత్త ఫోటోని షేర్ చేసారు. ఆ పిక్ లో మహేష్ క్లీన్ షేవ్ అండ్ లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నారు.

Also read : Gal Gadot : నాలుగోసారి తల్లి అయిన ‘వండర్ ఉమెన్’..

ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ లుక్ SSMB29 కోసమేనా..? లేదా నార్మల్ లుక్..? అనేది చూడాలి. కాగా ఈ మూవీ ఈ సమ్మర్ లో స్టార్ట్ కాబోతుందంట. ఈ లాంచ్ ఈవెంట్ కి వరల్డ్ టాప్ డైరెక్టర్ ‘జేమ్స్ కామెరాన్’ ముఖ్య అతిథిగా రాబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు.

కె ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో మరో నిర్మాత ఎస్ గోపాల్ రెడ్డి కూడా భాగస్వామ్యం కాబోతున్నారు. ఇండియానా జోన్స్ తరహాలో అమెజాన్ ఫారెస్ట్ నేపథ్యంలో తెరకెక్కించబోతున్న ఈ చిత్రాన్ని.. హాలీవుడ్ మేకర్స్ తో కలిసి రాజమౌళి తెరకెక్కించబోతున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ గా ఇండోనేషియా యాక్ట్రెస్ ‘చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్’ని ఎంపిక చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు