Gal Gadot : నాలుగోసారి తల్లి అయిన ‘వండర్ ఉమెన్’..

'వండర్ ఉమెన్' ఫేమ్ గాల్ గాడోట్.. నాలుగోసారి తల్లి అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ ఎమోషనల్ నోట్ పెట్టారు.

Gal Gadot : నాలుగోసారి తల్లి అయిన ‘వండర్ ఉమెన్’..

Wonder Woman fame Gal Gadot blessed with baby girl

Updated On : March 7, 2024 / 3:08 PM IST

Gal Gadot : ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ చిత్రాలతో పరిచయమైన గాల్ గాడోట్.. ‘వండర్ ఉమెన్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. కాగా ఈ భామ నాలుగోసారి తల్లి అయ్యారు. 2008లో ‘జారోన్ వర్సనో’ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న గాడోట్.. 2011లో ‘అల్మా’కి, 2017లో ‘మాయ’కి, 2021లో ‘డానియెల్లా’కి జన్మనిచ్చారు. వీరి ముగ్గురు ఆడపిల్లలే.

ఇక ఇప్పుడు నాలుగోసారి కూడా గాడోట్.. ఆడపిల్లకే జన్మనిచ్చారు. తన సోషల్ మీడియా ద్వారా గాడోట్ ఈ విషయాన్ని అందిరితో పంచుకున్నారు. పసిపాపతో ఉన్న ఫొటోని షేర్ చేస్తూ.. “ప్రెగ్నన్సీ అనేది అంత ఈజీ. కానీ దానిని మేము సాధించాము. నా స్వీట్ గర్ల్ కి నేను స్వాగతం పలుకుతున్నాను. నువ్వు మా జీవితాల్లోకి వెలుగుని తీసుకొచ్చావు. అందుకే నీకు ‘ఓరి’ అనే పేరు పెడుతున్నాను. ఓరి అంటే హీబ్రూ భాషలో వెలుగు అని అర్ధం” అంటూ రాసుకొచ్చారు.

Also read : Sharwanand : ‘శతమానం భవతి’ సీక్వెల్‌లో శర్వానంద్ హీరో కాదా? మరి ఇంకెవరు?

 

View this post on Instagram

 

A post shared by Gal Gadot (@gal_gadot)

ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్టు చూసిన నెటిజెన్స్ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా గాల్ గాడోట్ చివరిగా స్పై థ్రిల్లర్ మూవీ ‘హార్ట్ ఆఫ్ స్టోన్‌’తో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ‘అలియా భట్’ ఒక ముఖ్య పాత్ర పోషించారు. గత ఏడాది రిలీజైన ఈ చిత్రం మంచి విజయానే అందుకుంది. ప్రస్తుతం ఈ భామ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఒకటి రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరొకటి ఈ భామ కోసం ఎదురు చూస్తుంది.