PV Sindhu : పి.వి. సింధు వెడ్డింగ్ రెసెప్షన్ లో మెరిసిన సెలబ్రిటీస్..

భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

star celebrities at PV Sindhu wedding photos goes viral

PV Sindhu : భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. గత ఆదివారం ఉదయపూర్‌లో వ్యాపారవేత్త వెంకట సాయితో ఏడడుగులు వేసింది. రాజస్థాన్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు ఈ జంట. రాజస్థాన్ లో గ్రాండ్ వెడ్డింగ్ అనంతరం తాజాగా హైదరాబాద్ లో వీరి రెసెప్షన్ జరిగింది. ఇక ఈ వేడుకకి చాలా మంది టాలీవుడ్ సినీ సెలెబ్రిటీస్ వచ్చారు.

నిన్న జరిగిన ఈ ఈవెంట్ కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి నవ వధూ వరులను ఆశీర్వదించారు. ఆయనతో పాటు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా వచ్చారు. అలాగే అక్కినేని కింగ్ నాగార్జున..తమిళ స్టార్ హీరో అజిత్ కూడా వచ్చారు. టాలీవుడ్ బ్యూటీ మృణాల్ సైతం సింధు రెసెప్షన్ లో మెరిసింది. సింగర్ మంగ్లీ కూడా హాజరయ్యారు.

Also Read : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ నెక్స్ట్ సినిమా షూటింగ్ అప్పటినుండే.. హీరోయిన్ ఆమేనా..?

కేవలం వీరే కాకుండా.. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కూడా వచ్చారు. అలాగే పలువురు రాజకీయ నాయకులు కూడా వచ్చారు. హరీష్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. తదితరులు వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. దీంతో ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.