Star Comedian Brahmanandam said he Doing a Mass Villain Role in Upcoming Film
Brahmanandam : హాస్య నటుడిగా దాదాపు 1000 కి పైగా సినిమాలలో నటించి అలరించారు బ్రహ్మానందం. ఆయన్ని చూస్తేనే నవ్వొస్తుంది. అలాంటిది ఆయన సినిమాలో కామెడీ చేస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఎన్నో రకాల పాత్రలతో కొత్త కొత్త హావభావాలతో ప్రేక్షకులను నవ్వించారు. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన బ్రహ్మానందం ఇప్పుడు మాత్రం చాలా సెలెక్టీవ్ గా అడపాదడపా సినిమాలు చేస్తున్నారు.
బ్రహ్మానందం ఇప్పుడు తన కొడుకు రాజా గౌతమ్ తో సినిమా చేస్తున్నాడు. బ్రహ్మ ఆనందం పేరుతో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో బ్రహ్మానందం తాతగా, గౌతమ్ మనవడిగా చేయడం విశేషం. స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై రాహుల్ యాదవ్ నక్కా నిర్మాణంలో నిఖిల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజ్ చేశారు. కామెడీతో పాటు తాత – మనవడు ఎమోషన్ తో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. బ్రహ్మానందం, గౌతమ్ మెయిన్ లీడ్స్ లో వెన్నెల కిశోర్, ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్.. పలువురు ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కానుంది.
Also Read : The Award : చేనేత కళాకారులపై సినిమా.. ది అవార్డ్ ట్రైలర్ రిలీజ్..
బ్రహ్మానందం చాలా రోజుల తర్వాత ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేస్తుండటం, తన కొడుకుతో సినిమా చేస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బ్రహ్మానందం కామెడీ కోరుకునేవాళ్ళు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల బ్రహ్మానందం మీమర్స్ తో ముచ్చటించారు. సోషల్ మీడియాలో బ్రహ్మానందం ఫోటో లేకుండా దాదాపు మీమ్స్ ఉండవు. మీమ్స్ గాడ్ అని బ్రహ్మానందంను అంటారని తెలిసిందే. మీమర్స్ తో ముచ్చటించిన బ్రహ్మానందం వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ క్రమంలో అన్ని రకాల పాత్రలు చేశారు. కామెడీ, హీరో, సెంటిమెంట్ గా మెప్పించారు విలన్ అవకాశాలు రాలేదా అని అడగ్గా బ్రహ్మానందం సమాధానమిస్తూ.. విలన్ ఆఫర్ వచ్చింది. త్వరలోనే వస్తుంది. నిజంగానే విలన్ పాత్ర చేస్తున్నాను. ఆ విలనిజం ఎలా ఉంటుంది అంటే థియేటర్ అంతా షేక్ అయ్యేలా ఉంటుంది. త్వరలోనే ఆ సినిమా రావొచ్చు అని అన్నారు. దీంతో అన్ని రకాల పాత్రలతో మెప్పించిన బ్రహ్మానందం త్వరలోనే విలన్ గా కూడా తన విలనిజాన్ని చూపించబోతున్నారని తెలుస్తుంది.
విలన్ క్యారెక్టర్లో బ్రహ్మానందం….😡😡#brahmanandam pic.twitter.com/KWT2fO7byk
— TeluguOne (@Theteluguone) February 3, 2025