Janhvi Kapoor: లవ్ లైఫ్ కన్ఫర్మ్ చేసిన జాన్వీ.. టీ-షర్ట్‌పై ప్రియుడి పేరు.. నెట్టింట ఫొటోలు వైరల్
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించినప్పుడు ఆమె ధరించిన టీ-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది.
Star heroine Janhvi Kapoor drops a hint about her boyfriend Shikhar Pahariya
-
జాన్వీ కపూర్ ప్రేమ ప్రకటన.
-
టీ-షర్ట్‌పై ప్రియుడి పేరు.
-
శిఖర్ పహారియాతో డేటింగ్ హింట్.
Janhvi Kapoor: బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన ‘పెద్ది’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె ‘అచ్చియమ్మ’ పాత్రతో మెప్పించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ సినిమాలో ఆమె గ్లామర్, నటనతో ఆకట్టుకోగా, కొన్ని సీన్స్ వివాదాస్పదం కావడంతో మేకర్స్ వాటిని తొలగించారు. ఇక, సినిమా విజయాల సంగతి పక్కన పెడితే, జాన్వీ కపూర్ తన వ్యక్తిగత జీవితం, ప్రేమ వ్యవహారాల ద్వారా నిరంతరం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. తాజాగా ఆమె ధరించిన ఒక వినూత్నమైన టీ-షర్ట్ ద్వారా తన ప్రేమను దాదాపు అధికారికంగా ప్రకటించినట్లయింది.
వైరల్ టీ-షర్ట్, ప్రేమ ప్రకటన:
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇటీవల ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించినప్పుడు ఆమె ధరించిన టీ-షర్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ షర్ట్‌పై “ఒకవేళ నేను తప్పిపోతే.. దయచేసి నన్ను నా ప్రియుడికి అప్పగించండి” అనే క్యూట్ కొటేషన్‌తో పాటు కింద ‘శిఖర్ పహారియా’ అని రాసి ఉంది. చూసేందుకు ఇది చాలా సరదాగా, ఫన్నీగా ఉన్నప్పటికీ.. తను శిఖర్ పహారియాతో ప్రేమలో ఉన్నాననే విషయాన్ని జాన్వీ క్లియర్ కట్‌గా హింట్ ఇచ్చిందని బాలీవుడ్ వర్గాలు, అభిమానులు నమ్ముతున్నారు.
ఇంతకీ ఎవరీ శిఖర్ పహారియా?
శిఖర్ పహారియా మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు. ఒక ప్రముఖ రాజకీయ, వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబానికి చెందిన శిఖర్, పోలో క్రీడాకారుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. జాన్వీ, శిఖర్‌లు గత కొన్నేళ్లుగా డేటింగ్లో ఉన్నారంటూ బాలీవుడ్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వైరల్ టీ-షర్ట్ ఫొటోలతో వారి రిలేషన్‌షిప్‌పై నెటిజన్లు క్లారిటీకి వచ్చారు. ఈ క్రేజీ కపుల్‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

