టాలివుడ్ లో ప్రొడ్యూసర్స్ పరిస్థితి మింగలేక.. కక్కలేక అన్నట్లు తయారైంది. పెద్ద హీరోలతో సినిమా చేస్తే వాళ్లు కోరిన కోర్కెలన్నీ తీర్చాల్సి వస్తోంది. బాబు బయిటికెళ్తే గొడుగుపట్టాలి.. బాబు ఫ్యామిలీ టూర్ కి వెళ్తే టిక్కెట్లు బుక్ చేయాలి.. బాబు బర్త్ డే వస్తే పండగలా చేయాలి.. ఇలా తయారైంది పెద్ద హీరోలతో సినిమాలు నిర్మిస్తోన్న ప్రొడ్యూసర్ల పరిస్థితి. రీసెంట్ గా సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యామిలీతో కలిసి సౌత్ ఆఫ్రికా టూర్ కి వెళ్తే దాదాపు 30 లక్షల ఖర్చు మహర్షి సినిమా నిర్మాతలే ఖర్చుచేశారు. సినిమాకి 20 కోట్లకి పైగా రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోలు చివరికి ఫారెన్ లో షూటింగ్ పెట్టుకుంటే.. అక్కడ షాపింగ్ ఖర్చులు కూడా నిర్మాతల జేబుల్లోంచే వసూల్ చేస్తున్నారు.
అంతేకాదు జనతా గ్యారెజ్ టైంలో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏకంగా ప్రొడ్యూసర్స్ డబ్బుతోనే రెండు కోట్లు విలువచేసే వాచీ కొనుగోలుచేశాడు. అంతేకాదు.. షూటింగ్ కోసం తారక్ ఎప్పుడు దుబాయ్ వెళ్లినా..50 లక్షల షాపింగ్ చేయకుండా అస్సలు తిరిగిరాడు. ఆ ఖర్చంతా నిర్మాతలే భరించాలి. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోన్న ప్రొడ్యూసర్లు హీరోలని పందెం కోళ్లలా సాకుతున్నారు.
రానా,రవితేజ,నితిన్ విషయానికి వస్తే.. ఫారెన్ లో షూటింగ్ ఉందంటే చాలు అక్కడ షాపింగ్ కి అయిన ఖర్చు మొత్తం ప్రొడ్యూసర్స్ జేబులోంచే పెట్టిస్తారు. సినిమా మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎండింగ్ దాకా.. రెమ్యూనరేషన్ కాకుండా స్టార్ హీరో చిన్న వాటర్ బాటిల్ కొన్నా.. కోట్లు ఖరీదు చేసే వస్తువు కొన్నా.. దాని ఖర్చు ప్రొడ్యూసర్లే భరించాలి. దీన్ని కొంతమంది నిర్మాతలు బడ్జెట్ లో భాగంగానే యాక్సెప్ట్ చేస్తున్నా మరికొంతమంది నిర్మాతలు హీరోకి కోపం వస్తే సినిమా ఏమవుతుందోననే భయంతో సైలెంట్ గా ఉంటున్నారు.