Star Singer Armaan Malik Married his Girlfriend Aashna Shroff Wedding Photos goes Viral
Armaan Malik : బాలీవుడ్ స్టార్ సింగర్ అర్మాన్ మాలిక్ నేడు తన గర్ల్ ఫ్రెండ్ ఆష్నా ష్రాఫ్ ని పెళ్లి చేసుకున్నాడు.
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా వివాహం చేసుకుంది. అర్మాన్ మాలిక్ తన సోషల్ మీడియాలో అధికారికంగా వీరి పెళ్లి ఫొటోలు షేర్ చేసారు.
బాలీవుడ్ లో స్టార్ సింగర్ అయిన అర్మాన్ మాలిక్ తెలుగులో కూడా ఆల్మోస్ట్ ఓ 100 పాటల వరకు పాడాడు. అల్లు అర్జున్ బుట్ట బొమ్మ సాంగ్ పాడింది ఇతనే. అదే కాకుండా అనేక సూపర్ హిట్ సినిమాల్లో చాలా సాంగ్స్ పాడాడు.
హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళీ, బెంగాలీ, ఒడియా, కొంకణి.. ఇలా చాలా భాషల్లో అర్మాన్ మాలిక్ సాంగ్స్ పాడారు. సినిమాల్లోనే కాక ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడారు.
అర్మాన్ మాలిక్ పెళ్లి చేసుకున్న ఆష్నా ష్రాఫ్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూఎన్సర్. అలాగే ఈమెకు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ కూడా ఉంది. ఫ్యాషన్ మోడల్ కూడా. ఓ యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తుంది.
గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న అర్మాన్ మాలిక్, ఆష్నా ష్రాఫ్ నేడు ఘనంగా వివాహం చేసుకున్నారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.