హై రిస్క్ చేస్తున్న నటులు

  • Publish Date - November 6, 2020 / 05:54 PM IST

Stars Weight Loss and Gain Secret : సినిమా అంటే అంత ఈజీకాదు..ఏదో 4 ఫైట్లు, 6 సీన్లు అనే జమానా ఎప్పుడో పోయింది. ఎన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ లేదు. అందుకే ప్రేక్షకుల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు స్టార్లు. ఈ మద్య కంగనా అలాంటి రిస్క్ చేసింది.



జయలలిత బయోపిక్ : – 
జయలలిత బయోపిక్ లో జయలలిత క్యారెక్టర్ చేస్తున్న కంగనా క్యారెక్టర్ కోసం 20 కిలోల బరువు పెరిగింది. పెరిగిన బరువుతో డ్యాన్స్ చెయ్యడంతో వెన్ను భాగం దెబ్బతిందని చెబుతోంది కంగనా. ఆ పెరిగిన బరువు తగ్గడానికి 7,8 నెలలుగా బాగాకష్టపడుతున్నా అని చెప్పింది బాలీవుడ్ క్వీన్.



సౌత్ స్టార్ సూర్య : – 
కంగనానే కాదు క్యారెక్టర్ కోసం కష్టాలు పడిన మరో హీరో సౌత్ స్టార్ సూర్య. రిలీజ్ కు రెడీగా ఉన్న సూర్య..ఆకాశమే హద్దురా సినిమా కోసం వెయిట్ తగ్గడానికి చాల కష్టపడ్డారట. ఫిట్ గా కనిపించడం కోసం దాదాపు నెలరోజులు ఓన్లీ ఎగ్ వైట్, కీరా మాత్రమే తీసుకున్నారట. అంత స్ట్రిక్ట్ డైట్ తో బాడీ మెటబాలిజంలో బాగా తేడా వచ్చేసి హార్మోన్ ఇన్ బ్యాలెన్స్ వచ్చేస్తుందని చెబుతున్నారు సూర్య. అందుకే తన డైట్ మహా డేంజర్ అని ..ఫాలో అవ్వద్దని చెప్పారు ఈ సౌత్ స్టార్ హీరో.



తమిళ హీరో శింబు : – 
మరో తమిళ హీరో శింబు కూడా సినిమా కోసం తెగ కష్టాలు పడుతున్నారు. లాంగ్ గ్యాప్ తర్వాత ఈశ్వరన్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శింబు వెయిట్ తగ్గడానికి నానా కష్టాలు పడ్డారు. కొద్ది నెలల్లోగా 30 కేజీలకు పైగా వెయిట్ తగ్గి అందరినీ సర్ ప్రైజ్ చేశారు. అంత కఠినమైన డైట్, ఫిట్ నెస్ చెయ్యొద్దని డాక్టర్ చెప్పినా కూడా జాగ్రత్తగా ఫాలో అయ్యి వెయిట్ తగ్గారు శింబు.



శౌర్య రిస్క్ : – 
టాలీవుడ్ హీరో శౌర్య కూడా రిస్క్ చేశారు. ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సినిమాలో శౌర్య క్యారెక్టర్ కోసం బాడీ బిల్డప్ చేశారు. ఆ సీన్ కి కావల్సిన బాడీ కోసం షూటింగ్ లో కనీసం సలైవా కూడా మింగకుండా 5 రోజులు కఠినమైన డైట్ ని ఫాలో అయ్యారని శౌర్య టీమ్ చెప్పింది. ఇలా చాల మంది నటులు క్యారెక్టర్ కోసం కష్టమైన పనులు చేస్తూ..ఒక్కోసారి హై రిస్క్ చేస్తున్నారు.