Telangana Women Commission : టాలీవుడ్ పై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. సినిమాలో చిత్రీకరించే కొన్ని సన్నివేశాలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై అసభ్యకర సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారంటూ ఫిర్యాదు అందడంతో మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.
సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే అంశమని, ఒక సన్నివేశాన్ని చిత్రీకరించేటప్పుడు దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మహిళా కమిషన్ హెచ్చరించింది. మహిళల విషయంలో హద్దు మీరితే చర్యలు తప్పవని తేల్చి చెప్పింది.
సినిమాల్లోని పాటల్లో డ్యాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులు అందాయని రాష్ట్ర మహిళా కమిషన్ తెలిపింది. సినిమా అనేది సొసైటీపై ప్రభావం చూపే మాధ్యమమని, అలాంటి వాటిలో మహిళలను కించపరిచే అంశాలు ఉండటం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోందని మహిళా కమిషన్ పేర్కొంది. ఇకనైనా దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు కాస్త బాధ్యతతో ఉండాలని మహిళా కమిషన్ సూచించింది.
Also Read : బెట్టింగ్ యాప్స్ ఎఫెక్ట్.. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో పాటు వాళ్లందరిపై కేసు నమోదు..