Betting Apps : బెట్టింగ్ యాప్స్ ఎఫెక్ట్.. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో పాటు వాళ్లందరిపై కేసు నమోదు..

మియాపూర్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన పలువురు నటులపై కేసులు నమోదు చేసారు.

Betting Apps : బెట్టింగ్ యాప్స్ ఎఫెక్ట్.. రానా, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో పాటు వాళ్లందరిపై కేసు నమోదు..

Polise Filed Case on Rana Vijay Deverakonda Manchu Lakshmi and other Actors in Betting Apps Promotion

Updated On : March 20, 2025 / 11:31 AM IST

Betting Apps : గత కొన్ని రోజులుగా బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయన్సర్లు, సెలబ్రిటీలపై పోలీసులు సీరియస్ అవుతున్న సంగతి తెలిసిందే. బెట్టింగ్ తో చాలా మంది సాధారణ ప్రజలు ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకుంటుండటంతో పోలీసులు దీనిపై ఫోకస్ చేసారు.

ఇప్పటికే పలువురు సోషల్ మీడియా ఇన్ ఫ్ల్యూయన్సర్లపై కేసు నమోదు చేసి కొంతమందిని పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే తాజాగా మరికొంతమంది టీవీ, సినిమా సెలబ్రిటీలపై కేసు నమోదు చేసారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసిన పలువురు నటులపై కేసులు నమోదు చేసారు.

Also Read : Jack Song : సిద్ధూ జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య ‘జాక్’ సినిమా నుంచి.. ముద్దు సాంగ్ రిలీజ్..

నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళలతో పాటు ప్రణీత, సిరి హనుమంతు, శ్రీముఖి, వంశీ సౌందర్య రాజన్, వసంత కృష్ణ, శోభా శెట్టి, అమృత చౌదరి, నయిని పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్ ఖాన్, విష్ణు ప్రియ, సాయి, భయ్యా సన్నీ, నటి శ్యామల, టేస్టీ తేజ, బండారు శేష సుప్రీత, రీతు చౌదరిల పై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇప్పటికే వీరిలో పలువురిని పోలీస్ స్టేషన్ కి పిలిపించి విచారిస్తున్నారు. మరి దీనిపై ఆయా నటీనటులు స్పందిస్తారా లేదా చూడాలి.